Menu

నిన్న రిపబ్లిక్ డేనాడు పవన్ కళ్యాణ్ హఠాత్ గా శ్రీకాకుళం జిల్లాలోని రాజాంకు వచ్చి సందడి చేయడం చాలామందికి అశ్చర్యాన్ని కలిగించింది. పవన్ వీరాభిమానులు కూడా ఈ అనుకోని పవన్ టూర్ కు షాక్ అయ్యారు అని టాక్. పవర్ స్టార్ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ నిన్న ఉదయం శ్రీకాకుళం చేరుకొని అక్కడ రాజంలోని జిఎంఆర్ వరలక్ష్మి కేర్ ఆసుపత్రి, జీఎంఆర్ ఐటీలను సందర్శించాడు అని వార్తలు వస్తున్నాయి.

అంతేకాకుండా అక్కడ ఆసుపత్రిలో వైద్యం పొందుతున్న రోగులతో మాట్లాడటమే కాకుండా అక్కడ ఉన్న వైద్య సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నట్లు టాక్. ఆ తరువాత నైరెడ్ లో స్వయం ఉపాధిపై శిక్షణ పొందుతున్న వారితో పవన్ కళ్యాణ్ మాట్లాడి వారిని ప్రోత్సహించాడు అనే వార్తలు వినపడుతున్నాయి.

అయితే పవన్ రాక విషయాన్ని ఈ కార్యక్రమ నిర్వాహకులు ఎంత రహస్యంగా ఉంచినా ఆఖరి క్షణంలో పవన్ రాకను తెలుసుకున్న పవన్ అభిమానులు పోటెత్తి పోయారు అని వార్తలు వస్తున్నాయి. అయితే ఉత్తారాంద్ర ప్రాంతానికి చెందిన ఈ చివరిలో ఉన్న పట్టణానికి నిన్న పవన్ కళ్యాణ్ రాక వెనుక, నిన్న అరసవిల్లిలో జరిగిన రధసప్తమి వేడుకలు కూడా పవన్ ను ఆ ప్రాంతానికి వచ్చేడట్లుగా చేసాయి అనే మాటలు కూడా ఫిలింనగర్ లో వినిపిస్తున్నాయి.

అదీ కాకుండా త్వరలో ‘గబ్బర్ సింగ్ 2’ సెట్స్ పైకి వెళ్ళబోతోంది కాబట్టి సెంటిమెంట్ రీత్యా పవన్ తన సామాజిక అభిరుచులను ఆధ్యాత్మిక విషయాలతో ముడి వేసుకుని ఇలా నిన్న శ్రీకాకుళంలో సందడి చేసాడు అని అనుకోవాలి.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77189/PAVAN-RAJAM-STRATEGY/

0 comments:

Post a Comment

 
Top