గాయకుడు దేశపతి శ్రీనివాస్ తెలంగాణ ప్రాంతంలో పేరు మోసిన గాయకుడు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులలో తన పాటల ద్వారా ఆ ఉద్యమ స్పూర్తికి ఎంతో సేవలు చేసారు. అటువంటి దేశపతి శ్రీనివాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ పై చేసిన సంచలన వ్యాఖ్యలు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారాయి
తన సినిమాల ద్వారా చెడు సందేశాలను ఇస్తున్న పూరి జగన్నాథ్ తన కంట కనిపెడితే ఆయన చెంప పగల కొడతానని ఆవేశంగా వ్యాఖ్యలు చేసారు దేశపతి శ్రీనివాస్. స్త్రీలను, గురువులను అవమాన పరిచే విధంగా పూరి సినిమాలు తీస్తున్న తీరు తనకు ఆశ్చర్యం కలిగిస్తోందని అందువల్ల పూరి తన పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు.
అంతేకాదు ప్రజలకు మేలు కలిగించే సందేశాలు ఇచ్చే సినిమాలను తీస్తే అవి విజయవంతం కావని వ్యాఖ్యానించిన పూరి మాటలు బట్టి పూరి వ్యక్తిత్వం ఏమిటో అర్ధం అవుతుందని ఈ గాయకుడు వ్యాఖ్యానించారు. మెదక్ జిల్లాలో జరిగిన ఒక కాలేజీ సెమినార్ కార్యక్రమంలో పాల్గొన్న దేశపతి శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే టాలీవుడ్ దర్శకుల తీరు మారకుంటే తాను ఊరుకోను అని చెపుతున్న ఈ గాయకుడి మాటలు రానున్న కాలంలో టాలీవుడ్ లో పెను దుమారమే సృష్టించే అవకాశం కనిపిస్తోంది. అయితే పూరి కన్నా ఘోరంగా తెలుగులో సినిమాలు తీస్తున్న చాలామంది దర్శకులు దేశపతి శ్రీనివాస్ మాటలు వల్లనైనా మారుతారేమో చూడాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76986/FAMOUS-SINGER-SENSATIONAL-COMMENTS-ON-PURI-JAGANNATH/

0 comments:
Post a Comment