టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో 2015వ సంవత్సరం క్రేజీగా మారబోతుంది. ఎందుకంటే 2015వ సంవత్సరంలో బడా మల్టీస్టారర్ మూవీతో పాటు, రెండు భారీ బడ్జెట్ మూవీలు రిలీజ్ కాబోతున్నాయి. అవే బాహుబలి, రుద్రమదేవది. ఇదిలా ఉంటే, ఈ సంవత్సరం మొత్తం మీద ఎన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయో, ఇప్పటికే సినీ ప్రేక్షకులు వాటికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని చూశారు. 2015 సంక్రాంతికి పవన్, వెంకీల ‘గోపాల గోపాల’ మినహా డైరెక్ట్ గా విడుదలైన పెద్ద సినిమా మరొకటి లేదు. శంకర్, విక్రమ్ ల ‘ఐ’ భారీ స్థాయిలో విడుదలైనా మాస్ ని మెప్పించలేకపోయింది. దీంతో సంక్రాంతికి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కళ తప్పిందనే చెప్పాలి.
ఇదిలా ఉంటే, ఈ సంక్రాంతికి చాలా సినిమాల ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లు విడుదలయ్యాయి. సంక్రాంతి తరువాత రిలీజ్ కాబోతున్నక్రేజీ మూవీలు, వాటికి సంబంధించిన ఫస్ట్ లుక్స్ ని రిలీజ్ చే సత్తా చాటారు. వీటిలో రామ్ ‘పండగ చేస్కో’, నాని ‘ఎవడే సుబ్రమణ్యం’, నారా రోహిత్ ‘పండగలా వచ్చాడు’, ‘అసుర’, సాయిధరమ్ తేజ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ మరియు ‘రుద్రమదేవి’ సినిమాలోని అల్లు అర్జున్ ప్రెష్ లుక్ ఇలా చాలా మూవీలు పండుక్కి ఫస్ట్ లుక్ ముహర్తం పెట్టుకున్నారు. రిలీజ్ కాబోతున్న మూవీల లేటెస్ట్ స్టిల్స్, ఫస్ట్ లుక్స్ బయటకు వచ్చేసరికి సినీ అభిమానులకి, సినీ సందడి కంటే ఫస్ట్ లుక్స్ సందడి ఎక్కువగా ఉంది. అయితే రిలీజ్ కాబోతున్న మూవీలలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన సుబ్రమణ్యం ఫర్ సేల్ అనేది, సత్తా చాటుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడంట. 2015వ సంవత్సరం తనకు బాగా కలిసి వస్తుందని చెబుతున్నాడు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76438/Harish-Shankar-pilla-nuvvu-leni-jeevitham-tollywoo/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.