ఆమె ఎవరో కాదు నయనతార. దీనితో మీడియా రెచ్చిపోయి నయన మందు షాప్ దగ్గర రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది అంటూ కోలీవుడ్ మీడియా సెటైర్లు రాస్తూ వార్తలు ప్రకటించింది. ఆశ్చర్యకరంగా ఉన్న ఈవార్తల వివరాలలోకి వెళ్ళితే నయన తార హీరో విజయ్ సేతుపతితో కలిసి నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నానుమ్ రౌడీధాన్’ అనే తమిళ చిత్రంలోని షూటింగ్ కు సంబంధించిందని తెలిసి కోలీవుడ్ మీడియా ఇచ్చిన ట్విస్ట్ కు అందరు నవ్వుకున్నారు.
తన జీవితం లో ప్రేమ వ్యవహారంలో రెండు సార్లు దెబ్బతిన్న నయనతార తన పెళ్ళి వ్యవహారంలో కూడా దెబ్బతినడం త ఇక తన పెళ్ళి విషయంలో విరక్తి పెంచుకుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో నయన్ ఇలా వైన్ షాప్ లో చేసిన హడావిడి పై రకరకాల సెటైర్లు ఆమెపై పడుతున్నాయి.
అయితే ఎన్ని సమస్యలు ఎదురు అయినా నయన తార గోడకు కొట్టిన బంతిలా తన హవాను కొనసాగిస్తూ కోలీవుడ్ లో టాప్ హీరోయిన్స్ లిస్టులో కొనసాగటం ఆమె సమర్ధతకు నిదర్శనం.
source:http://www.apherald.com/Movies/ViewArticle/77054/NAYANTAARA-HUNGAAMA-IN-WINE-SHOP/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.