Menu


యువ దర్శకులకు అవకాశాలు ఇవ్వడంలో ముందుంటారు కింగ్ నాగార్జున. 
ఈ అక్కినేని అందగాడు ఇప్పటికే చాలా మంది ప్రతిభావంతులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. తాజాగా మరో యువ ప్రతిభాశాలికి దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. ‘మనం’ తర్వాత నాగార్జున చేయబోయే సినిమాకు పలువురు సీనియర్ దర్శకుల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే నాగార్జున కళ్యాణ్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో అతనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

కళ్యాణ్ దర్శకత్వంలో నాగార్జున డ్యూయల్ రోల్లో కనిపించనున్నారని సమాచారం. గ్రామీణ నేపధ్యంలో సాగే అందమైన కుటుంబ కధా చిత్రంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారట. నాగార్జున సరసన ఒక హీరోయిన్ గా రమ్యకృష్ణను ఎంపిక చేశారు. మరొక హీరోయిన్ ఎంపిక జరగాల్సి ఉంది. ఈ సినిమాకు ‘ఉయ్యాలా జంపాలా’ నిర్మాత రాధా మోహన్ స్క్రీన్-ప్లే అందిస్తున్నారు. నాగార్జున సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తారు. ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారు.
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన నటుడు అవసరాల శ్రీనివాస్ చెప్పిన కథ కూడా నాగార్జునకు నచ్చింది. ‘మనం’ తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఎన్టీఆర్ తో కలసి ఒక మల్టీస్టారర్లో నటించడానికి నాగార్జున అంగీకరించారు. ఇప్పుడు ఆ సినిమాకు సంబందించిన వార్తలు రావడం లేదు.


0 comments:

Post a Comment

 
Top