Menu


పవన్ వీరాభిమాని నితిన్ నటించిన లేటెస్ట్ సినిమా ‘చిన్నదాన నీకోసం' పరాజయం తరువాత ఎటువంటి సినిమా చేయాలో తెలియక అయోమయంతో తన దగ్గరకు వస్తున్న దర్శకులను, రచయితలను మరింత అయోమయంలో పడేస్తున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. వరస పెట్టి వచ్చిన రెండు సినిమాల పరాజయాలు నితిన్ ఆలోచనలను చాలా ప్రభావితం చేసింది అనే వార్తలు వినపడుతున్నాయి.

ఈమధ్య చాల మంది దర్శకులు నితిన్ వద్దకు వెళ్ళి తమ సినిమా కథలకు సంబంధించిన లైన్ చెప్పినా ఏ కథలు తనకు నచ్చలేదు అని అంటున్నాడట నితిన్. ఒక కథలో యాక్షన్‌ తక్కువైందని, వేరొక కధలో సెంటిమెంట్ ఎక్కువైందని ఇలా రకరకాల కారణాలతో తాను అయోమయంలో ఉంటూ తన దగ్గరకు వచ్చిన వారిని అయోమయంలో పదేస్తున్నారని టాక్.

దాదాపు 12 ఫ్లాప్ సినిమాల తరువాత హిట్ చూసిన నితిన్ తిరిగి సక్సస్ బాట పట్టినా మళ్ళీ లేటెస్ట్ గా ఫైయిల్యూర్ పలకరించడంతో నితిన్ పరిస్థితి కొద్దిగా షేక్ అవుతున్నాడని టాక్. ఫ్లాప్ సినిమాలు చేసే కన్నా ఒక సంవత్సరం ఖాళీగా ఉంటే వచ్చే నష్టం లేదని నితిన్ ఆలోచన అని అంటున్నారు.

అయితే నితిన్ లో ధైర్యాన్ని నింపి తమ సినిమాలలో నితిన్ ను నటించేలా ఒప్పించడానికి చాల మంది యువ దర్శకులు తమ వంతు ప్రయత్నాలను పట్టు వదలని విక్రమార్కుడిలా కొనసాగిస్తున్నే ఉన్నారని ఫిలింనగర్ టాక్.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78495/NITHIN-GETTING-FEARED/

0 comments:

Post a Comment

 
Top