Menu


ఈరోజు ఉదయం విడుదలయిన ‘గోపాల గోపాల’ విడుదలై కొన్ని గంటలు కుడా కాకుండానే ఈసినిమాలో కలియుగ కృష్ణుడి పాత్రలో కనిపించిన పవన్ నోటి వెంట వచ్చిన డైలాగ్స్ ఆ శక్తికర చర్చలకు తెర లేపుతోంది. పవన్ ఈ డైలాగ్స్ ను ఎవర్ని ఉద్దేశించి అన్నాడు అన్న విషయం పై రకరకాల అభిప్రాయాలు వ్యక్తo అవుతున్నాయి. ముఖ్యంగా ‘దారి చూపించడం వరకే నా పని, గమ్యాన్ని చేరుకోవడం మీ పని, నేను టైంకి రావడం కాదు తమ్ముడూ, నేను వచ్చాకే టైం అవుతుంది, సమర్థులు ఇంట్లో ఉండి పోతే, అసమర్థులు రాజ్యమేలుతారు’ అనే డైలాగ్స్ కలియుగ కృష్ణుడిగా పవన్ నోటి వెంట వచ్చినా ఆ డైలాగ్స్ పవన్ భవిష్యత్ లో విస్తృతంగా పూరించబోయే రాజకీయ శంఖారావానికి భావం వచ్చే విధంగా ఉన్నాయని అప్పుడే విశ్లేషకులు విశ్లేషణలు చేస్తున్నారు.  అయితే ఈ డైలాగ్స్ పట్ల సామాన్య ప్రేక్షకులు వెంటనే కనెక్ట్ కాలేకపోతున్నారు అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇద్దరు ప్రముఖ కమర్షియల్ హీరోలతో నిర్మించిన ప్రయోగాత్మక చిత్రంగా ‘గోపాల గోపాల’ మారిందని ఇరు రాష్ట్రాలలోని సగటు ప్రేక్షకుడు ఈ సినిమా పై కామెంట్లు చేస్తున్న నేపధ్యంలో ఈ సినిమా ఏ రేంజ్ హిట్ కు చేరుకుంటుంది అనే విషయం పై సంక్రాంతి తరువాత కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/75910/WHO-IS-INEFFICIENT-IN-PAVAN-THINKING-/

0 comments:

Post a Comment

 
Top