హీరో రామ్ ఏదైనా ఒక ప్రవేటు ఫంక్షన్ కు వెళితే అక్కడకు వచ్చిన అమ్మాయిలతో తనకు సమస్యగా మారిందని తన పై తానే సెటైర్లు వేసుకుంటున్నాడు. అంతేకాదు ఆ ఫంక్షన్స్ కు వచ్చిన అమ్మాయిలు తన వద్దకు వచ్చి పెళ్ళి ప్రస్తావన తీసుకు రావడం తనకు చాల అసౌకర్యంగా ఉందని బాధ పడుతున్నాడు.
తనకు చిన్న తనం నుండి అమ్మాయిలు అంటే చాల సిగ్గని అందువల్ల ఏదైనా ఫంక్షన్స్ కు వెళ్ళాలి అంటే తనకు భయం వేస్తోందని కామెంట్ చేసాడు రామ్. అంతేకాదు తన స్నేహితులందరికీ పెళ్ళిళ్ళు అయి పోవడంతో తనతో చనువుగా ఉండే తన స్నేహితుల భార్యలు తమ చుట్టాలలో అనేక మంది అమ్మాయిలు పెళ్ళికి రెడీగా ఉన్నారు అంటూ తన వెంటపడి వేధిస్తున్నారని బాధ పడుతున్నాడు.
ఆఖరికి తన కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడూ తన ముందు పెళ్ళి విషయం మాట్లాడుతూ ఉండటంతో తన పెళ్ళి గోల తనకు తలనొప్పిగా మారిందని సెటైర్లు వేసుకున్నాడు రామ్. అంతేకాదు తనకు ప్రస్తుతం వయస్సు 26 ఏళ్ళు మాత్రమే అని ఇంత చిన్న వయస్సులో తనకు అప్పుడే పెళ్ళి ఏమిటి అని తనకు తానే ప్రశ్నలు వేసుకుంటూ ఈరోజు ఒక ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ తన పెళ్ళి గోలను సరదాగా షేర్ చేసుకున్నాడు.
ప్రస్తుతం రామ్ కెరియర్ అంత ఆశాజనకంగా లేదు కాబట్టి ఇంతమంది అమ్మాయిలు మోజుపడుతున్న నేపధ్యంలో ఎవర్నో ఒకరిని పెళ్ళి చేసుకుంటే ఓ పని అయిపోతుంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78492/GIRLS-HAUNTING-RAM/
0 comments:
Post a Comment