'బాహుబలి' చిత్రం కోసం మూడేళ్లు కేటాయించిన ప్రభాస్‌కి ఈ చిత్రం తర్వాత ఎలాంటి సినిమా చేసినా కానీ 'చిన్నదే' అనిపిస్తుందనేది కూడా తెలుసు. రాజమౌళితో సినిమాలు చేసిన హీరోలంతా ఆ తర్వాత ఎలాంటి చిత్రం చేయాలో తెలీక తికమక పడ్డారు. 'ఛత్రపతి' తర్వాత ఆ ప్రభావం ఏంటో ప్రభాస్ స్వయంగా అనుభవించాడు. అందుకే 'బాహుబలి' తర్వాత ఎలాంటి సినిమాలు చేయాలనే ప్రణాళిక ఇప్పట్నుంచీ వేసుకుంటున్నాడు.
బాహుబలి తర్వాత ఒక క్లీన్ ఎంటర్‌టైనర్‌ని వీలయినంత తక్కువ బడ్జెట్‌లో ఫినిష్ చేయాలనేది ప్రభాస్ డిఫెన్స్ ప్లాన్ అని తెలిసింది. ఇందుకోసం అతను 'రన్ రాజా రన్' దర్శకుడు సుజిత్‌తో సినిమా ప్లాన్ చేసాడు. లైటర్‌వీన్‌లో సాగే సరదా కుటుంబ కథా చిత్రాన్ని చేసి, ఒక వర్గం ప్రేక్షకులని అయినా మెప్పించి పాస్ అయిపోవాలని, బాహుబలి తర్వాత ఉండే ప్రభావాన్ని ఈ ఒక్క సినిమాకే పరిమితం చేయాలని ప్రభాస్ బృందం ప్లాన్ చేస్తోంది. మగధీర తర్వాత ఆరెంజ్‌తో చరణ్ చేసినట్టుగా.. ప్రభాస్ కూడా చిన్నపాటి ప్రయోగమే విరుగుడు అని భావిస్తున్నాడట. మరి బాహుబలి ఎఫెక్ట్ ఒక్క సినిమాతో తగ్గించగలడో లేదో కాలమే చెప్పాలి.
source: http://telugu.gulte.com/tmovienews/8566/Prabhas-playing-defense-game#sthash.7fPMY9iJ.dpuf

0 comments:
Post a Comment