Menu

టాప్ హీరోల సినిమాలలో అవకాశాలు వస్తే హీరోయిన్స్ ఎంతో ఆనందంగా కాలం గడుపుతారు. అయితే ఇద్దరు టాప్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చినా ఆనంద పడలేని పరిస్థితిలో రకుల్ ప్రీత్ ఉంది అంటూ ఆమె పై సెటైర్లు పడుతున్నాయి. ప్రస్తుతం టాప్ యంగ్ హీరోల దృష్టి అంతా రకుల్ ప్రీత్ పై ఉండటంతో అందరూ ఆమెనే కోరుకుంటున్నారు.

రకుల్ కూడా వచ్చిన అవకాశాన్ని ఏదీ వదులు కోకుండా అవసరం అనుకుంటే ఒకే రోజున రెండు షూటింగ్స్ లో నటిస్తూ ఈ సంవత్సరాంతానికి టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా మారడానికి తన శక్తి వంచన లేకుండా కష్ట పడుతోంది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈమెకు ఒకేసారి వచ్చిన జూనియర్, రామ్ చరణ్ ల కొత్త సినిమాలు తల నొప్పిగా మారాయని టాక్.

దీనికి కారణం సుకుమార్ దర్శకత్వంలో జూనియర్ తో నటిస్తున్న సినిమా షూటింగ్ ఈ నెల నుంచే ప్రారంభం అవుతూ ఉంటే, శ్రీనువైట్ల దర్శకత్వంలో చరణ్ తో నటిస్తున్న సినిమా వచ్చేనెల నుండి ప్రారంభం అవుతోంది. ఈ రెండు సినిమాల షూటింగులు ఎక్కడా ఆగకుండా స్పీడ్ గా పూర్తి చేయాలని ఈ సినిమాల దర్శక నిర్మాతలు భావిస్తూ ఉండటంతో ఒకేసారి ఈ రెండు సినిమాలకు రకుల్ తన డేట్స్ ఎడ్జెస్ట్ చేయడానికి చాల కష్ట పడుతోందని టాక్.

మధ్యలో రకుల్ ప్రస్తుతం ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేస్తూ అటు జూనియర్ ఇటు చరణ్ ల మధ్య ఎలా నెగ్గుకు రావాలి అని రకుల్ తెగ టెన్షన్ పడి పోతోందని టాక్.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78703/RAKUL-PREETH-GETTING-TA-ARCHER-FROM-THAT-TWO-HEROES-/z

0 comments:

Post a Comment

 
Top