Menu

త్వరలోనే అనుష్క శర్మ, విరాట్ కోహ్లిలకి సంబంధించిన ఓ హాట్ న్యూస్ ని అందరూ వినబోతారని బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న క్లియర్ టాక్స్ ప్రకారం వీరిద్దరూ 2016లో పెళ్ళి చేసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ఇప్పటి వరకూ వీరిద్దరూ కలిసి చేసిన టి.వి యాడ్స్, అలాగే ఆన్ లైన్ యాడ్స్ చాలానే ఉన్నాయి. ఇప్పటికే ఓ మెబైల్ యాడ్‌లో న‌టించారు. అలాగే షాంపూ యాడ్‌లోనూ న‌టించారు. తాజాగా మ‌రో బ్రాండ్‌కు సంబంధించిన దాంట్లో, ఈ ఇద్దరూ క‌లిసే న‌టించే అవ‌కాశం ఉందని ఎడ్వర్‌టైజ్‌మెంట్ రంగం నుండి అందిన స‌మాచారం.

ఇదిలా ఉంటే, వీరిద్దరూ ఒకర్ని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారు. విరాట్ కోహ్లి ఎక్కడకు వెళుతున్న, తన వెంట సాధ్యమైనంత వరకూ అనుష్క శర్మ వెళ్ళటానికి ప్రయత్నిస్తుంది. అయితే పెళ్ళికి ముందే వీరిద్దరూ కలిసి ఓ మూవీలో నటించే అవకాశం కూడ ఉందట. ఇందుకు ఆధిత్య చోప్ర రంగం సిద్ధం చేసుకుంటున్నాడు.

ఆధిత్య చోప్ర భార్య రాణిముఖర్జీ ఇప్పటికే కోహ్లిని కలిసి, అసలు మేటర్ చెప్పింది. కోహ్లి హీరోగా, అనుష్క శర్మ హీరోయిన్ గా ఓ మూవీలో కనిపించాలనేది రాణి ముఖర్జీ కోరిక. అందుకు కోహ్లి కూడా ఒప్పుకున్నాడట. మొత్తంగా చాలా కాలంగా కొనసాగుతున్న వీరిద్దరి ఎఫైర్, త్వరలోనే పెళ్ళి తో శుభం కార్డ్ ని వేయనున్నారు.

sourace:http://www.apherald.com/Movies/ViewArticle/79131/Back-pain-anushka-Sharma-virat-kohli-tollywood-bol/

0 comments:

Post a Comment

 
Top