Menu


హీరోయిన్‌గా ఎవరూ ఎదుర్కోనన్ని విమర్శలు నిత్యామీనన్‌కే ఎదురవుతున్నాయెందుకో అర్థం కావడంలేదు సినీ జనాలకి. నటనలో మేటి, తెలుగులో మాట్లాడగలదు, డబ్బింగ్‌ చెప్పుకోవడమే కాకుండా పాటలు కూడా వినసొంపుగా పాడుతుంది. టాలెంట్‌తోపాటు లక్‌ కూడా ఉన్న నటి నిత్యామీనన్‌. లేటెస్ట్‌గా ఆమె హిట్‌ కొట్టిన సినిమా 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు'. ఈ సినిమాతోనూ నిత్యా మీనన్‌కి వ్యతిరేకంగా ప్రచారం జోరందుకుంది. హైట్‌ విషయంలో ఓ టాల్‌ అండ్‌ హ్యాండ్సమ్‌ హీరోపై కామెంట్స్‌ వేసి, ఇబ్బందులో పడినప్పటినుంచీ ఇప్పటివరకూ నిత్యామీనన్‌ చుట్టూ వివాదాలుంటున్నాయి. ఆ వివాదాలే లేకపోతే నిత్యామీనన్‌ స్టార్‌ హీరోయిన్‌ అయ్యేదే. 

'ఇష్క్‌', 'గుండె జారి గల్లంతయ్యిందే' నిత్యా మీనన్‌ కెరీర్‌లో బిగ్‌ హిట్స్‌. ఇంకో హీరోయిన్‌కి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ వస్తే, తెలుగులో హయ్యస్ట్‌ రెమ్యునరేషన్‌ తీసుకునే టాప్‌ ఫైవ్‌ హీరోయిన్స్‌ లిస్ట్‌లో ఛాన్స్‌ కొట్టేస్తుంది. నిత్యామీనన్‌కి ఆ అదృష్టం దక్కడంలేదు. కారణాలు అందరికీ తెలిసినవే. అవే వివాదాలు. తనకు సంబంధం లేకుండా తన చుట్టూ వివాదాలు అల్లుతున్నారని నిత్యామీనన్‌ అంటున్నా, వివాదాలు ఆమెతో సావాసం చేస్తూనే ఉన్నాయి


source: http://telugu.gulte.com/tmovienews/8563/Bad-Propaganda-on-Nitya-menon#sthash.rx4npCzz.dpuf

0 comments:

Post a Comment

 
Top