అన్ సీజన్‌లో పెద్ద సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు మామూలుగా కంటే ఎక్కువ ప్రమోట్ చేయాలి. అందులోను ఆ చిత్ర కథానాయకుడు, దర్శకుడు ఇద్దరూ బ్యాడ్ ఫామ్‌లో ఉన్నట్టయితే మరింతగా ఊదరగొట్టేయాలి. కానీ సినిమా విడుదలకి కేవలం రెండే రోజుల సమయం ఉన్నా కానీ టెంపర్ గురించి నిమ్మకి నీరెత్తినట్టున్నారు ఎన్టీఆర్, పూరి జగన్నాథ్. నిర్మాత బండ్ల గణేష్‌తో విబేధాల వల్లే ఈ చిత్రాన్ని వీరిద్దరూ లైట్ తీసుకుంటున్నట్టు పుకార్లు వినిపిస్తున్నాయి.
నిర్మాత సినిమా అమ్మేసుకుని ఎలాగోలా బయట పడిపోతాడు కానీ సినిమా ఫలితం తారుమారు అయితే నష్టపోయేది, ఇమేజ్ డ్యామేజ్ అయ్యేదీ హీరో, డైరెక్టర్‌లకే. ఈ లాజిక్‌ని వదిలేసి టెంపర్ సినిమాని గాలికి వదిలేస్తున్నారు పూరి, ఎన్టీఆర్. ఈ సినిమాకి హైప్ తేవడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తారని, కొత్తగా ట్రెయిలర్స్ ఏమైనా కట్ చేస్తారని అనుకుంటూ ఉంటే అస్సలు సందడే లేదు. మామూలుగానే బండ్ల గణేష్ తన సినిమాల పబ్లిసిటీ గురించి పట్టించుకోడు. ఈసారి దర్శకుడు, హీరో కూడా మొహం చాటేయడంతో టెంపర్ ప్రీ రిలీజ్ హంగామానే లేకుండా పోయింది.
source: http://telugu.gulte.com/tmovienews/8567/NTR-and-Puri-is-not-bothering-for-Temper-promotions#sthash.VsEYGPSG.dpuf
0 comments:
Post a Comment