Menu


బాలీవుడ్‌ చరిత్రని తిరగరాసిన 'పికె' చిత్రాన్ని దక్షిణాదిలో రీమేక్‌ చేయడానికి కమల్‌హాసన్‌ అంగీకరించాడని వార్తలు రాగానే, కమల్‌ ఈ సినిమా చేయడం కరెక్ట్‌ కాదేమో అన్నవారే ఎక్కువకనిపించారు. ఆ పాత్రకి తగ్గ వయసు  కమల్‌ది కాకపోగా, అది ఆయనకి సూట్‌ అయ్యే క్యారెక్టర్‌ కాదన్నది ఎక్కువమంది అభిప్రాయం. అయితే రాజ్‌కుమార్‌ హిరాని తీసే సినిమాల రీమేక్‌హక్కుల్ని కొనడం ఆనవాయితీగా పెట్టుకున్న జెమిని ఫిలిం సర్క్యూట్‌ సంస్థ ఈ చిత్రం హక్కుల్ని కూడా తీసుకుందని, నటించమని కమల్‌హాసన్‌ని మొహమాట పెట్టేస్తోందని వార్తలొచ్చాయి. 

గతంలో లగేరహో మున్నాభాయ్‌ చిత్రాన్ని రీమేక్‌ చేయడానికి చిరంజీవి ఇష్టపడకపోతే బలవంతంగా ఆయనతో శంకర్‌దాదా జిందాబాద్‌ చేయించారు. అదేమో పెద్ద ఫ్లాపయింది. పికెకి కూడా అలాగే కమల్‌హాసన్‌ని మొహమాటపెడతారని అనుకున్నారు కానీ తనకి ఖాళీ లేదని, ఆ చిత్రం చేయడానికి ఆసక్తి లేదని కమల్‌ తేల్చేసాడు. ఈ ఏడాదిలో తన సినిమాలు మూడు విడుదల కాబోతున్నాయి. ఆ పనులతో బిజీగా ఉన్న కమల్‌హాసన్‌ ఇప్పుడు మరో చిత్రం సైన్‌ చేసే మూడ్‌లో లేడు. మరి సౌత్‌ ఇండియా నుంచి పికె అవతారం ఎత్తేదెవరో వేచి చూడాల్సిందే. 


source: http://telugu.gulte.com/tmovienews/8564/Kamal-Haasan-saya-no-for-PK-remake#sthash.LinrnbNc.dpuf

0 comments:

Post a Comment

 
Top