Menu


జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమాకు వక్కతం వంశి కథ సమకూరుస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈసినిమాకు 1.04 కోట్లు పారితోషికంగా ఈసినిమా నిర్మాతలు తనకు ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నాడని టాక్.  ఇప్పటివరకు టాలీవుడ్ లో ఎప్పుడు రానికధను తాను జూనియర్ కోసం తెగ ఆలోచించి రచించాననీ ఈకథ జూనియర్ కు విపరీతంగా నచ్చడంతో జూనియర్ పూరి జగన్నాథ్ ను ఒప్పించి తన స్క్రిప్ట్ ను ఓకె అనిపించడమే కాకుండా తనకు ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ రచయితకు ఇవ్వనంత భారీ పారితోషికాన్ని తనకు వచ్చేడట్లుగా జూనియర్ సహకరించాడు అని వక్కతం వంశీ చేసుకుంటున్న ప్రచారం తన క్రేజ్ ను పెంచుకోవడానికా అంటూ సెటైర్లు పడుతున్నాయి.

  ‘టెంపర్’ కథ నుంచి ఇంత ఖర్చు పెరగడం వల్ల కాబోలు ఈ సినిమా బడ్జెట్ జూనియర్ సినిమాల మార్కెట్ స్థాయిని మించిపోయింది అనే వార్తలు హడావిడి చేస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమాకి సంబంధించిన శాటిలైట్ రైట్స్ గురించి ఒక ఆశక్తికర వార్త ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది.  వినపడుతున్న వార్తల ప్రకారం ఈసినిమా శాటిలైట్ హక్కులను ఓ ప్రముఖ టీవీ ఛానెల్ 7.75 కోట్లకు కొనేసింది అని టాక్. కోటి రూపాయల కథకు 7.75 కోట్ల శాటిలైట్ రేటుపలకడం ఈసినిమా నిర్మిస్తున్న బండ్లగణేష్ కు మంచి జోష్ ని ఇస్తుంది అనుకోవాలి..

0 comments:

Post a Comment

 
Top