Menu


అతి తక్కువగా మాట్లాడే పవన్ ఈమధ్య కాలంలో జనసేన ఏర్పాటు విషయంలో మాత్రమే చాల ఎక్కువగా నోరు విప్పి మాట్లాడాడు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్న తరువాత పవన్ సినిమా ఫంక్షన్స్ లో కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. అయితే మోడీ ప్రధానమంత్రి అయిన తరువాత చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ విషయం పై కూడా పవన్ ఎక్కడా స్పందించలేదు.  అయితే నిన్న నెల్లూరులో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల నేపధ్యంలో అతిధిగా వచ్చిన పవన్ నోటి వెంట మొట్టమొదటిసారి ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమ ప్రస్తావన వచ్చింది.

మంత్రి వెంకయ్య నాయుడు సిద్దాంతాలకు కట్టుబడిన వ్యక్తి అని అంటూ ఆయన ఆదర్శవంతమైన నాయకుడు అని చెపుతూ ఆకాశానికి ఎత్తేశాడు పవన్.  అంతేకాదు ఎదిగే వయసులో ఎలా వుండాలో స్వర్ణభారత్ ను అనుసరిస్తే తెలుస్తుంది అని అభిప్రాయ పడుతూ స్వఛ్ భారత్ ను ప్రతి ఒక్కరు తమదని భావించాలని, దేశం వున్నంతవరకు స్వఛ్ భారత్ వుంటుందని ఈ కార్యక్రమం పై మొట్టమొదటిసారిగా పవన్ తన ప్రశంసల వర్షం కురిపించాడు.  ఇదే కార్యక్రమంలో మరొక ముఖ్య అతిధిగా పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షంతో ఆకాశానికి ఎత్తేయడంతో పవన్ బిజెపిల మధ్య స్నేహబందం మరింత బలపడింది అనే సంకేతాలు ఈ కార్యక్రమానికి వచ్చిన వారికి అర్ధం అయింది.  

source:http://www.apherald.com/Movies/ViewArticle/76004/SWACH-BHAARAT-WORDS-FROM-PAVAN/

0 comments:

Post a Comment

 
Top