ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ ను పవర్ స్టార్ గా, టాలీవుడ్ ఎంపరర్ గా ఆరాధించిన పవన్ వీరాభిమానులు కొందరు పవన్ ను నిజంగానే దేముడిగా మార్చివేసి చేస్తున్న భజన పాటలు ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. దాదాపు 20 నిముషాలు ఉన్న ఈ పవన్ భజన కార్యక్రమం వీడియోను కొందరు పవన్ వీరాభిమానులు యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో ఇప్పుడు ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘కళ్యాణ్ బాబు నీకున్న ఘనత పాడితే మాకు పండగే’ అనే చరణంతో మొదలైన ఈ పాటలో పవన్ సూపర్ హిట్ సినిమాల పాటల చరణాలను కలుపుకుంటూ భజనగా మార్చుకుని పవన్ కళ్యాణ్ ఫోటోలకు దండలు వేసి అగరావత్తులతో హారతులు ఇస్తూ భక్తి భావంతో పవన్ అభిమానులు తమ భక్తిని చాటుకుంటున్నారు.
ఒక వైపు పవన్ తన ‘గోపాల గోపాల’ సినిమాలో ప్రతి వ్యక్తిలోనూ తమకు తాము తెలుసుకుంటే నీలోనే భగవంతుడు ఉన్నాడు అని చెపుతుంటే పవన్ వీరాభిమానులు మాత్రం పవన్ ను నిజంగానే భగవంతుడిగా మార్చివేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ విగ్రహంతో గుడి కట్టిన ఆయన వీరాభిమానులు రానున్న రోజులలో ఈ భజన పాటను తమ సెల్స్ కు కాలర్ ట్యూన్ గా మార్చుకుంటే సెల్ కంపెనీలకు కూడా ఆదాయం ఇచ్చిన వ్యక్తిగా మారిపోతాడు ఈ కలియుగ గోపాలుడు పవన్ కళ్యాణ్.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76462/WEB-MEDIA-GETTING-SHOCKED-WITH-PAVAN-BHAJANA-SONG/

0 comments:
Post a Comment