టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన మూవీ గోపాల గోపాల. గోపాల గోపాల మూవీ, బడా మల్టీస్టారర్ మూవీ కావడంతో, ఈ మూవీ పై ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ, సాధారణ సినీ ప్రేక్షకులలోనూ ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ఈ మూవీ, ఈ రోజు రిలీజ్ అయి, అన్ని చోట్ల నుండి పాజిటివ్ టాక్స్ ను సొంతం చేసుకుంది. దీంతో గోపాల గోపాల మూవీ కలెక్షన్స్, బాక్సాపీస్ వద్ద ఓ రేంజ్ లో ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. అయితే తాజగా, గోపాల గోపాల మూవీపై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది.
వివరాల్లోకి వెళితే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్‌ల మల్టీస్టారర్ గోపాల గోపాల మూవీ ప్రదర్శనపై హైదరాబాద్‌కి చెందిన రఘునాథ్ రావు అనే వ్యక్తి సైఫాబాద్ పోలీసులకి ఫిర్యాదు చేశాడు. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలు హిందువుల మనోభావాలు కించపరిచే విధంగా వున్నాయంటూ ఆయన అభ్యంతరం వ్యక్తంచేశాడు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గోపాల మూవీని తెరకెక్కించిన మేకర్స్ పై కేసు నమోదు చేయాల్సిందిగా ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నాడు. దీంతో రఘునాథ్ రావు ఇచ్చిన పిర్యాదుని స్వీకరించిన పోలీసులు, కేసుకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
అంతే కాకుండా విజయవాడలోనూ ఓ లాయర్ ఈ మూవీ పై కేసు నమోదు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. మొత్తంగా మూవీ బాక్సాపీస్ హిట్ అని క్లియర్ టాక్స్ వస్తే, ఇక ఈ మూవీపై బాలీవుడ్ మూవీ పి.కె తరహాలో ఏదొక కాంట్రవర్సీ క్రియేట్ అవ్వటమే, లేక చేయటమే చేస్తారు అని చెప్పాలి. ఈ సినిమా విడుదలకన్నా ఓ వారం రోజుల ముందే విశ్వ హిందూ పరిషత్ నేతలు కూడా గోపాల గోపాల రిలీజ్‌ని వ్యతిరేకిస్తూ మాసాబ్‌ట్యాంక్‌లోని సెన్సార్ బోర్డు ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసేవిధంగా వున్న గోపాలకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీ చేయకూడదంటూ వీహెచ్‌పీ నేతలు అప్పట్లో తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/75934/Goapala-gopala-gopala-pawan-kalyan-tollywood-venka/

0 comments:
Post a Comment