మహానటి సావిత్రిని ఇష్టపడని వారు ఉండరు. కేవలం కళ్ళల్లో బావ ప్రకటన చేస్తూ ఎంతటి క్లిష్టమైన పాత్రను అయినా ఆమె పోషించిందికనుకనే తెలుగు ప్రజలు ఎక్కడి వారైనా సరే అక్కినేని, నందమూరిల తరువాత అదే స్థాయిలో సావిత్రి చనిపోయి మూడు దశాబ్దాలు అయిపోతున్నా ఆమెను ఇంకా గుర్తు పెట్టుకునే ఉన్నారు. అటువంటి మహానటి సావిత్రి పై సమంత వింత వ్యాఖ్యలు చేసింది. తనకు సావిత్రి అన్నా ఆమె నటించిన సినిమాలు అన్నా తనకు చాల ఇష్టం అని అంటూ తాను 1960 – 70 ప్రాంతాలలో ఎందుకు పుట్టలేకపోయానా అని తెగ బాధ పడుతోంది సమంత.
సావిత్రి సినిమాలు చూస్తూ ఆమె నటన నుండి ఎన్నో విషయాలను నేర్చుకున్నాననీ ప్రశాంతమైన వాతావరణంలో కనిపించే అలనాటి సినిమాలలో తాను ఎందుకు నటించ లేకపోయానా అని బాధ కలుగుతోందట సమంతకు. అయితే ట్విస్ట్ ఏమిటంటే సావిత్రి టాలీవుడ్ కోలీవుడ్ లను మహరాణిలా ఏలిన రోజులలో పారితోషికంతో సంబంధం లేకుండా ఎన్నో విలక్షణమైన సినిమాలలో చాల తక్కువ పారితోషికంతో అవసరం అయితే పారితోషికం లేకుండా నటించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అని అంటారు అలనాటి సినిమాల విశ్లేషకులు. కానీ ఒక్క సినిమా సూపర్ హిట్ తో కోట్ల పై తమ పారితోషికాలను పుచ్చుకుంటున్న లిస్టులో ముందు స్థానంలో ఉన్న సమంత సావిత్రి చేసినంత త్యాగాలు చేయగలదా అన్నదే సందేహం.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76052/SAMANTA-SENSATIONAL-COMMENTS-ON-SAVITHRI/

0 comments:
Post a Comment