Menu


టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు హావా ఎక్కువుగా నడుస్తుంది. ఎందుకంటే తను నటిస్తున్న మూవీలు అన్నీ కార్పోరేట్ స్టైల్లో, చాలా రిచ్ గా ఉంటాయని సినీ అభిమానుల టాక్. తాజాగా మహేష్ బాబు, కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు మూవీలో నటిస్తున్నాడు.

ఈ మూవీ అనంతరం ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా ప్రిన్స్ మరో మూవీ షూటింగ్ ల పాల్గొనే విధంగా తన డేట్స్ ని ఫిక్స్ చేశాడు. ప్రస్తుతం కొరటాల శివకి సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇందులో మహేష్ బాబు, పూర్ణలపై వచ్చే ఓ సాంగ్ ని షూట్ చేసారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే తన అప్ కమింగ్ మూవీని గతంలో చెప్పినట్టుగానే శ్రీకాంత్ అడ్డాలతో కమిట్ అయ్యాడు ప్రిన్స్. ఈ సినిమా ప్రముఖ నిర్మాత పివిపి బ్యానర్ పై తెరకెక్కుతుంది. 

కేవలం మూవీకి సంబంధించిన కమిట్మెంట్ మాత్రమే కాకుండా, ఈ మూవీని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, టైటిల్ ఏం పెట్టాలి వంటి విషయాలపై చిత్ర యూనిట్ ఫుల్ క్లారిటిలో ఉంది. శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబు కాంబినేషన్ అప్ కమింగ్ ఫిల్మ్ కి ‘బ్రహ్మోత్సవం’ అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇక్కడ విశేషం ఏమిటంటే, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు అనే టైటిల్ ఎలా ఉందో, సరిగ్గా అటువంటి తెలుగు టైటిల్ ని మాత్రమే తన మూవీకి పెట్టాలని, దర్శకుడుకి ప్రిన్స్ వార్నింగ్ ఇచ్చాడంట. దీంతో శ్రీకాంత్ అడ్డాల బ్రహ్మోత్సం అంటూ మూవీకి టైటిల్ పెట్టాడు. దానినే ప్రిన్స్ ఫిక్స్ చేశాడంట. అలాగే ఈ సినిమా మే నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ ని శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. గతంలో మహేష్ బాబు శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమా చేసాడు. 

source:http://www.apherald.com/Movies/ViewArticle/76014/Maheshbabu-tollywood-sreemanthudu-telugu-films-sna/

0 comments:

Post a Comment

 
Top