Menu

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన ‘పికె’ సినిమా ఫై వివాదాలు ముదిరి పోతున్నా ఆ వివాదాల స్థాయికి మించి ఈ సినిమా క్రియేట్ చేస్తున్నా రికార్డులు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికి 620 కోట్ల కలెక్షన్స్ మైలురాయిని దాటింది అనే వార్తలు వస్తున్నాయి. దీనితో 'ధూమ్‌3' 547 కోట్ల రికార్డును అమీర్ ఖాన్ బ్రేక్ చేసాడు. అంతేకాదు బాలీవుడ్ లో తన ‘పికె’ సినిమా 600 కోట్ల క్లబ్‌ను ప్రారంభించాడు ఆమీర్‌ ఖాన్‌. ఈ సినిమా పై కొందరు వ్యక్త పరుస్తున్న విమర్శలు కూడా ఈసినిమాకు పబ్లిసిటీగా మారడంతో కలెక్షన్స్ ఈసినిమాకు ఈ రేంజ్ లో వచ్చాయని వార్తలు వినిపిస్తున్నాయి.

 ఈ వార్తలు ఇలా ఉండగా ఈసినిమాలో ఎటువంటి వివాదాస్పద సన్నివేశాలు లేవు అని కోర్టు కూడా తీర్పు ఇవ్వడంతో ఈసినిమా కలెక్షన్స్ ముగింపు దశకు వచ్చేసరికి 700 కోట్ల స్థాయిని చేరుకుంటుంది అనే వార్తలు వినపడుతున్నాయి. ‘పీకే’ ఫస్ట్ లుక్ విడుదల నుండి వివాదాలు పెరుగుతున్న కొద్దీ ఈసినిమా పై క్రేజ్ సమాంతరంగా ప్రేక్షకులలో పెరగడం ‘పికె’ టాప్ సక్సస్ కు బిజినెస్ సీక్రెట్ గా మారింది.  ఈ సినిమాను దక్షిణాది సినిమా భాషలలో రీమేక్ చేద్దామని చాలామంది నిర్మాతలు ప్రయత్నిస్తున్నా టాప్ హీరోలు అంతా అమీర్ ఖాన్ పేరు చెపితే భయపడుతున్నారని టాక్

source:http://www.apherald.com/Movies/ViewArticle/76023/AMIR-KHAN-TOUCHES-620-CRORES/

0 comments:

Post a Comment

 
Top