Menu



వివాదాల రామ్ గోపాల్ వర్మ పవన్ ‘గోపాల గోపాల’ పై కామెంట్లు చేస్తూ పవన్, చిరుల మధ్య పోటీ పెట్టి వారిద్దరి మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ‘గ్రేట్ చిరంజీవి గారి 150వ సినిమా విడుదలైన రోజే పవన్ కళ్యాణ్ మరో కొత్త సినిమా కూడా విడుదలైతే చూడాలని ఉంది’ అంటూ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్విట్ లోని ట్విస్టు ఏమిటి అంటూ అప్పుడే చాలామంది రకరకాల ఆలోచనలు చేస్తున్నారు.  కొందరు విశ్లేషకులు అయితే చిరంజీవి కన్నా పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరిగి పోయింది అని అర్ధం వచ్చేడట్లు ఈ ట్విట్ ఉంది అని అంటూ మరోకొత్త విశ్లేషణను తెరపైకి తీసుకు వస్తున్నారు.

మెగా స్టార్ గా తెలుగు సినిమా రంగాన్ని దాదాపు మూడు దశాబ్దాల పాటు ఏలిన చిరంజీవి 150వ సినిమా అంటే అంచనాలు ఆకాశం పై ఉంటాయి. అటువంటి సినిమాతో పవన్ కళ్యాణ్ సినిమా పోటీ అంటే వినడానికి మరో ప్రపంచ వింతగా ఉన్నా అందులో ఎన్నో అర్ధాలు ధ్వనిస్తాయి.  ఇప్పటికే అంతంత మాత్రంగా ఉన్న చిరంజీవి పవన్ ల మధ్య బంధాన్ని అన్యాపదేశంగా చూపెడుతూ వర్మ ఇటువంటి పగటి కలతో ట్విట్ చేసి ఉంటాడు. ఆమధ్య చిరంజీవి పవన్ గురించి మాట్లాడుతూ దారులు వేరైనా గమ్యం ఒక్కటే అని చిరంజీవి అన్న మాటలు తెలిసి వర్మ ఇటువంటి ట్విట్ చేశాడా లేక తెలియక చేసాడా అనే విషయంపై క్లారిటీ లేకపోయినా ఈ ట్విట్ లో అనేక అర్ధాలు ఉన్నాయి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/76048/VARMA-RAISED-FIRE-BETWEEN-CIRU-AND-PAVAN/

0 comments:

Post a Comment

 
Top