Menu


సమంతా సిద్దార్థల మధ్య బ్రేకప్ వ్యవహారంలో యంగ్ హీరోయిన్ దీప సన్నిధి కారణం అంటూ ఒక ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ఒక ఆ శక్తికర కథనాన్ని ఈరోజు ప్రచురించింది. ప్రస్తుతం కోలీవుడ్ లో వరస పెట్టి సినిమాలు చేస్తున్న సిద్ధార్థ్ ‘ఎనక్కుల్ ఒరువన్’ సినిమాలో యంగ్ హీరోయిన్ దీప సన్నిధితో నటిస్తున్నప్పుడు వీరిద్దరి మధ్య స్నేహం బాగా బలపడటమే కాకుండా వీరు తరుచూ చెన్నైలో షికార్లు చేస్తున్న విషయం సమంత దృష్టికి వచ్చిందని టాక్. అంతేకాదు సిద్ధార్థ్ ఈ సినిమాలో హీరోయిన్ గా దీపా సన్నిధికి పట్టుపట్టి హీరోయిన్ వేషం ఇప్పించిన విషయం కూడా సిద్ధూ సమంతల మధ్య దూరాన్ని పెంచింది అని ఈ పత్రిక కధనం.

ఈ విషయమై గత కొద్దికాలంగా సమంతా సిద్ధార్ధల మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది అనే వార్తలు ఉన్నాయి. అయితే అందుకేకాబోలు సిద్ధార్థ్ తమ బ్రేకప్ న్యూస్ మీడియాలో వచ్చిన తరువాత ట్విట్ చేస్తూ ‘ఎంతటి చీకటి పరిస్థుతులు ఎదురైనా భగవంతుడు నమ్మకాన్ని, ధైర్యం కలిగిస్తాడు’ అని పెట్టిన ట్విట్ బట్టీ సమంతా సిద్ధార్థ్ ల బ్రేకప్ వ్యవహారంలో సిద్ధార్థ్ పాత్రకన్నా సమంత పాత్ర ఎక్కువగా ఉంది అని అనిపిస్తోందని ఆ పత్రిక విశ్లేషణలు రాస్తోంది. కానీ సమంత సన్నిహితులు మాత్రం సమంత ఏనాడు సిద్ధార్థను ప్రేమించలేదని సమంత అందరితోను చనువుగా ఉండే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వీరిద్దరి ప్రేమ వ్యవహారం పై ప్రేమ కథలు ప్రచారంలోకి వచ్చాయని మరో కొత్త కథనం తెర పైకి తీసుకు వస్తున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/75891/DEEPA-SANNISHI-BETWEEN-SAMANTHA-AND-SIDARTH/

0 comments:

Post a Comment

 
Top