ఈరోజు విడుదల అవుతున్నపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గోపాల గోపాల' చిత్రంపై ప్రముఖ నిర్మాత బండ్లగణేష్ తన ట్విట్టర్ లో సంచలన వ్యాఖలు చేసాడు.పవన్ కళ్యాణ్ ను తనకు దేవుడు ఇచ్చిన వరంగా భావించే బండ్లగణేష్ పవర్ స్టార్ ను ఇప్పటికే అనేక సార్లు బహిరంగంగా పొగిడి తన భక్తిని చాటుకున్నాడు. ఇక లేటెస్ట్ గా ఈరోజు విడుదలైన ‘గోపాల గోపాల’ చిత్రం పై బండ్లగణేష్ పెట్టిన ట్విట్ అత్యంత ఆ శక్తి దాయకంగా మారింది.
‘‘శబరిలో అయ్యప్ప, శ్రీశైలంలో మల్లప్ప, హైదరాబాద్‌లో పవనప్ప గోపాల గోపాల బ్లాక్ బస్టరరప్ప అంటూ '' అంటూ ట్విట్ చేసిన పొగడ్తలు పవన్ అభిమానులకు మంచి జోష్ ను ఇస్తున్నాయి. అయితే ఆమధ్య తాను నిర్మించిన ‘గోవిందుడు అందరివాడేలే’ ఆడియో ఫంక్షన్ లో మాట్లాడుతూ ఆ సినిమా హీరో రామ్ చరణ్ ను, చిరంజీవిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేసిన బండ్లగణేష్ ఆరోజు మాట్లాడుతూ తాను ఏ హీరోతో సినిమా తీస్తూ ఉంటే ఆ సినిమా హీరోను విపరీతంగా పొగుడుతాను అంటూ అసలు సీక్రెట్ బయటకు చెప్పాడు. దీనిని బట్టి చూస్తూ ఉంటే నిర్మాత బండ్ల గణేష్ మళ్ళీ పవన్ కళ్యాణ్ పై గురి పెడుతున్నాడా అని అనిపిస్తుంది. ఏమైనా దేవుడు పాత్రధరించిన పవన్ నేటితో పవనప్పగా మారిపోయాడు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/75864/BANDLA-GANESH-NEW-TITLE--TO-PAVAN/

0 comments:
Post a Comment