టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా స్టార్ డం ని సంపాదించుకున్న హీరో మహేష్ బాబు. తను ఏ మూవీ తీసిన బాక్సాపీస్ వద్ద రికార్డ్స్ మోత మ్రోగాల్సిందే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుకు 2014లో నటించిన రెండు సినిమాలు ‘1 నేనొక్కడినే’, ‘ఆగడు’ ఆశించినంత ఫలితాలను ఇవ్వలేకపోయాయి. అంతే కాకుండా బాక్సాపీస్ వద్ద ఈ రెండు చిత్రాలు ఘోరమైన రిజల్ట్ ని చవిచూశాయి. దీంతో ప్రిన్స్ తను సెలక్ట్ చేసుకుంటున్న చిత్రాలపై జాగ్రత్తలు వహించడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే 2015లో మొత్తం మీద మూడు సినిమాలను విడుదల చెయ్యాలని మహేష్ నిర్ణయించుకున్నాడు. ఇలా అనుకున్నాడో.. లేదో.. అప్పుడే నిర్ణయాన్ని మార్చుకునే దిశలో ఉన్నట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వేసవికి ఈ సినిమాను విడుదల చేయాలనీ ప్లాన్ చేశారు. వెంటనే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం’ చేయడానికి అంగీకరించారు. ఈ రెండు మూవీల అనంతరం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తారని క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ మూడు చిత్రాలు ఒకే సంవతసరంలో రిలీజ్ చేస్తే, ప్రేక్షకులకు తన సినిమాలు బోరింగ్ మారతాయని మహేష్ ఫీల్ అవుతున్నాడు. అందుకే కొరటాల శివ, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వస్తున్న చిత్రాలని మాత్రమే రిలీజ్ చేయాలని ఆలోచిస్తున్నాడు. ఇలా కాకుండా ఒకవేళ పూరీ జగన్నాధ్ మూవీ కూడ 2015లో రిలీజ్ చేస్తే, అది మహేష్ తీసుకున్న సాహసమైన నిర్ణయమే అని టాలీవుఢ్ అంటుంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/75799/Mahesh-babu-tollywood-koratala-shiva-poori-jaganna/

0 comments:
Post a Comment