పవన్ కళ్యాణ్ కు కథ చెప్పి ఒప్పించడం అంత సాధారణమైన విషయం కాదు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కు అత్యంత అత్మీయుడిగా ఉన్న త్రివిక్రమ్ కూడా గతంలో పవన్ కు నచ్చే విధంగా కథ చెప్పలేకపోయానని ఆయనే స్వయంగా ఒకసారి చెప్పాడు. ఈ నేపధ్యంలో ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల పవన్ కళ్యాణ్ గురించి ఒక ఆ శక్తికర విషయం తెలియచేసాడు. శేఖర్ కమ్ముల ‘లీడర్’ కథను తయారుచేసుకుని పవన్ కళ్యాణ్ కు గతంలో వినిపిస్తే పవన్ కు ఆ కథ నచ్చక తరువాత ఆలోచిద్దాం అంటూ నెమ్మదిగా తన అయిష్టతను వ్యక్తపరిచాడట.
అయితే శేఖర్ కమ్ముల మాత్రం పవన్ ‘లీడర్’ సినిమాలో నటించి ఉంటే ఒక సంచలనంగా మారి ఉండేదని అభిప్రాయ పడటమే కాకుండా పవన్ తో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన క్రెడిట్ తనకు దక్కి ఉండేదని అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆ తరువాత రానాతో ఆ సినిమాను తీసినా తాను కోరుక్కున్న సూపర్ హిట్ ను అందుకోలేకపోయానని ఇప్పటికీ బాధ పడుతున్నాడు శేఖర్ కమ్ముల. గతంలో పూరి జగన్నాథ్ కూడా పవన్ తో ‘ఈడియట్’, ‘పోకిరి’ సినిమాల కథలను చెప్పినా పవన్ కు నచ్చక పోవడంతో అవి వేరే హీరోలకు సూపర్ హిట్లుగా మారిపోయాయి. అందుకే కాబోలు పవన్ కు కథ చెప్పడమే కత్తి మీదసాము అని అంటారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/75819/PAVAN-REJECTS-SEKHAR-KAMMULA-STOPRY/

0 comments:
Post a Comment