జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని జూనియర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన ఒక ఆడియో సందేశం ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారింది. కర్ణాటక ప్రాంతానికి చెందిన వీరాభిమాని తన పేరు చెప్పకుండా దాదాపు ఐదు నిముషాల పాటు జూనియర్ సినిమాల ఎంపిక పై తన స్పష్టమైన అభిప్రాయాన్ని యంగ్ టైగర్ కు తెలిసి వచ్చేలా చాల విడమరిచి చెప్పాడు. తాను ఎన్టీఆర్ ను జూనియర్ అని అననని తన దృష్టిలో ఎన్టీఆర్ అంటే జూనియర్ తప్ప మరెవ్వరూలేరని తనకు సీనియర్ ఎన్టీఆర్ గురించి పెద్దగా తెలియదని సంచలన వ్యాఖ్యలు చేసాడు ఈ అజ్ఞాత వీరాభిమాని.
అంతేకాదు గత దశాబ్ద కాలంలో వచ్చిన మంచి సినిమాలలో ‘రాఖీ’, ‘యమదొంగ’ ప్రధమ స్థానంలో నిలుస్తాయని కామెంట్లు చేసాడు ఆ అభిమాని. అంతేకాదు సినిమాలు అంటే పంచ్ డైలాగులు పలకడం, సుమ్మోలు గాల్లోకి లేవడం కాదు అని అంటూ ఈమధ్యనే విడుదలైన ‘టెంపర్’ టీజర్ చివరిన జూనియర్ చూపించిన భావాలు మరే ఇతర హీరోలు చూపించలేరని ఆ అభిమాని జూనియర్ ను ఆకాసానికి ఎత్తేశాడు. సినిమా అంటే 70, 80 కోట్లు ఖర్చు పెట్టించి ‘1 నేనొక్కడినే’ వంటి సినిమాలతో నిర్మాతల్ని వేధించడం కాదు అంటూ మధ్యలో మహేష్ ప్రస్తావన కూడా తీసుకు వచ్చి శంకర్ లాంటి దర్శకుల దర్శకత్వంలో ‘ఐ’ లాంటి విభిన్నమైన సినిమా టాలీవుడ్ లో ఒక్క ఎన్టీఆర్ మాత్రమే చేయగలడు అని అంటున్నాడు. ఈ వీరాభిమాని సూచనలతో జూనియర్ లో మార్పులు వస్తాయేమో చూడాలి
source:http://www.apherald.com/Movies/ViewArticle/75870/JUNIOR-FAN-ADVICE-ON-WEB-MEDIA/

0 comments:
Post a Comment