ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద దుమ్మురేపే కలెక్షన్స్ తో దూసుకుపోతున్న చిత్రం గోపాలగోపాల. గోపాల గోపాల మూవీకి సంబంధించిన కలెక్షన్స్, ఎక్కడ చూసినా హాట్ టాపిక్ గా వినిపిస్తున్నాయి. గతంలో బడా మల్టీస్టారర్ మూవీగా వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు మూవీ తరువాత అంత కంటే ప్రమోషన్ ని సంపాందించుకున్న మల్టీస్టారర్ మూవీ గోపాల గోపాల. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరగటంతో, రిలీజ్ రోజే భారీ రెస్పాన్స్ ని సంపాందించుకుంది. పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేష్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ సక్సెస్ ని సాధించింది. ట్రేడ్స్, రివ్యూవర్స్ సైతం వీరిద్దరి కాంబినేషన్ పై పాజిటివ్ రెస్పాన్స్ ని ఇచ్చారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే, టాలీవుడ్ లో మరొ కొత్త న్యూస్ హల్ చల్ చేస్తుంది. 2016లో మళ్ళీ వీరిద్దరి కాంబినేషన్ లో మరో మూవీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే ఈసారి, ఆ మల్టీస్టారర్ మూవీకి నిర్మాతగా కేవలం సురేష్ ప్రొడక్షన్స్ మాత్రమే ఉంటుందట. ఇప్పటికే దగ్గుబాటి సురేష్ బాబు, పవన్ కళ్యాణ్ తో దీనికి సంబంధించిన కమిట్మెంట్ ని సైతం తీసుకున్నట్టుగా తెలుస్తుందని, ఫిల్మ్ ఇండస్ట్రీలో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి సంక్రాంతికి వచ్చిన బడా మల్టీస్టారర్ చిత్రం, బాక్సాపీస్ వద్ద గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఈ మూవీ ఎంత వరకూ సక్సెస్ అని చెప్పటానికి మరో అయిదు రోజులు వెయిట్ చేయాలి. వారం రోజుల్లో ఈ మూవీ కనీసం 60 కోట్ల రూపాయలను భీట్ చేయగలిగితే, అది ఇండస్ట్రీ హిట్ గా చెప్పవచ్చు. ఇక మొత్తం కలెక్షన్స్ 80 కోట్ల రూపాయలను టచ్ చేస్తే, ఇక బ్లాక్ బస్టర్ అయినట్టే.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76015/Gopala-gopala-tollywood-telugu-films-suresh-produc/

0 comments:
Post a Comment