Menu


టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ రిలీజ్ చిత్రం గోపాల గోపాల. గోపాల గోపాల మూవీ ప్రస్తుతం టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద, సునామీ కలెక్షన్స్ ని క్రియేట్ చేస్తుంది. డొమెస్టిక్ మార్కెట్ లోనే కాకుండా ఓవర్సీస్ మార్కెట్ లోనూ గోపాల గోపాల మూవీ అధిరిపోయే కలెక్షన్స్ ని కొల్లగొడుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన ‘గోపాల గోపాల’ సినిమా జనవరి 10న రిలీజ్ అయింది. ఓపెనింగ్ డే నే, ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ తో అధరగొట్టింది. దీంతో సెకండ్ డే గోపాల గోపాల మూవీ కలెక్షన్స్ మరింత పెరిగాయి.

కేవలం ఫ్యాన్స్ షో నుండి మాత్రమే కాకుండా సాధారణ ఆడియన్స్ కూడ గోపాల గోపాల మూవీని ఎంజాయ్ చేయటంతో, గోపాల గోపాల మూవీకి మౌత్ టాక్ ప్లస్ గా మారింది. ఇదిలా ఉంటే ఓవర్సీస్ మార్కెట్ లోనూ గోపాల గోపాల మూవీకి చెప్పుకోదగ్గ కలెక్షన్స్ వచ్చాయి.

మొదటి రెండు రోజుల్లో గోపాల గోపాల సినిమా $585 వేల డాలర్స్ కలెక్ట్ చేసింది. ఇండియన్స్ కరెన్సీ ప్రకారం సుమారు 3 కోట్ల 65 లక్షలు. 93 లొకేషన్స్ లో రిలీజ్ అయిన గోపాల గోపాలకి ఓవర్సీస్ లోనూ మంచి రెస్పాన్స్ వస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కలిసి నటించడమే ఈ సినిమాకి పెద్ద పల్స్అయితే , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ అంతకన్నా పెద్ద ప్లస్ అవ్వడంతో ఆడియన్స్ సినిమా చూడటానికి మరింత ఆసక్తి చూపుతున్నారు. మొత్తంగా మూడు రోజుల ఓవర్సీస్ బాక్సాపీస్ రిపోర్ట్ ను ఎస్టిమేట్ చేస్తున్న ట్రేడ్స్, దాదాపు 6 కోట్ల రూపాయల వరకూ కలెక్షన్స్ ని కొల్లగొట్టవచ్చని అంటున్నారు. 

source:http://www.apherald.com/Movies/ViewArticle/76011/Gopalagopala-venkatesh-pawan-kalyan-tollywood-news/

0 comments:

Post a Comment

 
Top