Menu


రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కు మొదటి భారీ పరిశ్రమగా వస్తున్నహీరో మోటార్ కార్పొరేషన్ అల్లు అర్జున్ కు ఊహించని అదృష్టంగా మారింది. ఈ ద్విచక్ర వాహనాల సంస్థ తయారుచేసిన 125 CC గ్లామర్ మోటార్ బైక్ లేటెస్ట్ మోడల్ కోసం దక్షిణాది రాష్ట్రాలలో బ్రాండ్ అంబాసిడర్ గా అల్లుఅర్జున్ ను ఎంపిక చేసింది. అంతేకాదు బన్నీ పై ఒక వెరైటీ యాడ్ ను చిత్రీకరించి ఛానల్స్ లో అప్పుడే ప్రసారం కూడా చేసేస్తోంది.

స్టైలిష్ గా ఉండే అల్లుఅర్జున్ ఒక అందమైన మోటార్ సైకిల్ నడుపుతూ వేగంగా దూసుకు పోతూ ఉంటే ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న అమ్మాయిల దగ్గర నుంచి పెళ్ళి కూతురుగా పెళ్ళి చేసుకుంటున్న అమ్మాయిలు అంతా బన్నీ మోటారు బైక్ వెనుక పడటం చాలా వెరైటీగా చిత్రీకరించారు.

అయితే ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా మొదట్లో మహేష్ ను పెట్టుకోవాలి అని అనుకున్న ఈ కంపెనీ నిర్వాహకులు అనేక తర్జనభర్జనల అనంతరం బన్నీని ఈ యాడ్ కు ఎంపిక చేసారు అని టాక్. దీనికి ప్రధాన కారణం దక్షిణాది రాష్ట్రమైన కేరళలో అల్లుఅర్జున్ కు యూత్ లో ఉన్న క్రేజ్ బన్నీకి ఈ యాడ్ తెచ్చి పెట్టింది అని అంటున్నారు.

ఈ యాడ్ లో నటించి నందుకు బన్నీకి చాల భారీ స్థాయిలోనే పారితోషికం ఇచ్చారు అనే వార్తలు ఉన్నాయి. అయితే ఈ అల్లువారి హీరో ఇలా వరస పెట్టి కార్పోరేట్ యాడ్స్ లో దూసుకు రావడం మహేష్ కు మరొక షాక్ అనుకోవాలి. క్రితం సంవత్సరం తన ‘రేసు గుర్రం’ తో రేసులా దూసుకు పోయిన బన్నీ ఈ సంవత్సరం ఇంకా ఎన్ని సంచలనాలు చేస్తాడో చూడాలి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/80355/MAHESH-GOT-ANOTHER-UNEXPECTED-SHOCK-FROM-BANNY-/


0 comments:

Post a Comment

 
Top