విభిన్న చిత్రాలు తెరకెక్కించడంలో వెంకట్ ప్రభు అనే దర్శకుడికి ప్రత్యేక నేపథ్యం ఉంది. 'సరోజ' పేరుతో శ్రీహరి ప్రధాన పాత్రలో కొన్నాళ్ళ క్రితం ఓ చిత్రం వచ్చింది. ఆ చిత్ర దర్శకుడే వెంకట్ ప్రభు. తమిళ హీరో కార్తితో కలిసి 'బిరియానీ' అనే సినిమా చేసిన ఈ వెరైటీ చిత్రాల దర్శకుడు, సూర్యతో 'మాస్' అనే సినిమా చేస్తున్నాడు. సూర్య డైరెక్టర్స్ హీరో. వాడుకున్నోళ్ళకు వాడుకున్నంత అన్నట్టుగా అతనిలో నటనా ప్రతిభ వెలికి వస్తుంది. దాన్ని వెంకట్‌ప్రభు కూడా గుర్తించాడు.
సూర్య నట విశ్వరూపాన్ని 'మాస్'లో వెంకట్ ప్రభు చూపించబోతున్నాడట. వెంకట్ ప్రభు టాలెంట్‌ని చూసి, సొంతంగా ఈ సినిమాని సూర్య నిర్మిస్తున్నాడు. నయనతార, ప్రణీత ఈ సినిమాలో హీరోయిన్లు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమాపై సూర్య చాలా నమ్మకంతో ఉన్నాడు. టోటల్‌గా తన కెరీర్‌లోనే ది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని 'మాస్'పై నమ్మకంగా చెబుతున్నాడు సూర్య. తన రేంజ్‌కి తగ్గ హిట్స్ పడక కొన్నాళ్ళుగా డీలాపడ్డ సూర్య, 'మాస్'తో ఎలాంటి హిట్ కొడతాడో చూడాలిక.
source:http://telugu.gulte.com/tmovienews/8433/Surya-hopes-on-Mass-movie
0 comments:
Post a Comment