ఈమధ్యనే తన కొత్త లుక్ తో ‘టెంపర్’ ఆడియో వేడుకలో సందడి చేసిన ఛార్మీ లేటెస్ట్ గా ఒక యువకుడుని ఒక డిన్నర్ పార్టీలో చెంప దెబ్బ కొట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆశక్తి కరమైన ఈ విషయాన్ని ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. సినిమా తారల ‘సెలెబ్రెటీ క్రికెట్ లీక్ మ్యాచ్’ నిర్వాహకులు పేద వారైన ఒక వంద చిన్నారుల గుండె ఆపరేషన్ కోసం ఏర్పాటు చేసిన డిన్నర్ కార్యక్రమంలో ఈ సంఘటన చోటు చేసుకుంది అని తెలుస్తోంది.
సుమారు 60 లక్షల భారీ ఫండ్ ఈ చారిటీ డిన్నర్ ద్వారా వసూలు చేయబడ్డ ఈ కార్యక్రమంలో అనేక మంది తారలు పాల్గొన్నారు. కాజల్ అగ్రవాల్,సోహాలి ఖాన్, సచిన్ జోషీ లాంటి కొంతమంది సెలిబ్రెటీలు అయితే ఈ డిన్నర్ లో పాల్గొనడమే కాకుండా చిన్నారుల ఈ 100 హార్ట్ ఆపరేషన్స్ కార్యక్రమానికి భారీ మొత్తాలలో డొనేషన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ ఛారిటీ డిన్నర్ లో పాల్గొన్న ఒక యువకుడిని ఛార్మీ చెంప దెబ్బ కొట్టినట్లుగా తెలుస్తోంది.
తెలుస్తున్న సమాచారం మేరకు ఆ చారిటి డిన్నర్ లో పాల్గొన్న ఒక 17 సంవత్సరాల యువకుడు తాను ఛార్మీ అభిమానిని అంటూ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో ఒక ఫోటోను తీయించు కుంటానని కోరాడట. డానికి ఒప్పుకున్నా చార్మీతో ఆ యువకుడు ఫోటో తీయించుకుంటూ ఛార్మీ నడుం చుట్టూ చేయి వేసి ఫోటో తీయించుకోబోయాడట.
దీనితో తిక్కరేగిన ఛార్మీ ఆ యువకుడుని అందరు ముందే చెంప దెబ్బ కొట్టిందని తెలుస్తోంది. కేవలం 17 సంవత్సరాల వయస్సు కూడా లేని ఒక యువకుడు ఈ రకంగా ప్రవర్తించడం తనకు ఆశ్చర్యపరచడమే కాకుండా సమాజం ఇంత దిగజారి పోతోందా? అని తనను ఆలోచింప చేస్తోందని కామెంట్స్ చేసింది ఛార్మి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77639/YOUNG-PERSON-GOT-SLAPPED-BY-CHARMEE-/
0 comments:
Post a Comment