నందమూరి సింహం బాలకృష్ణకు పవర్ ఫుల్ టైటిల్స్ పై రోజురోజుకు మోజు పెరిగి పోతోంది. గత సంవత్సరం ‘లెజెండ్’ గా వచ్చి సూపర్ హిట్ అందుకున్న తరువాత ఈ సమ్మర్ రేసులో ‘లయన్’ గా గర్జించ బోతున్నాడు. ఈ వార్తలు ఇలా ఉండగా బాలకృష్ణ 99వ సినిమాకు సంబంధించి ఒక ఆ శక్తికర వార్త ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది.
‘లౌక్యం’ సినిమా దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ‘డిక్టేటర్’ అనే టైటిల్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్యకు విజయాలను ఇచ్చే సెంటిమెంట్ హీరోయిన్ గా నయనతార నటిస్తున్న ఈ సినిమాలో కథ రీత్యా బాలకృష్ణది చాల పవర్ ఫుల్ పాత్ర కావడంతో ఈ టైటిల్ ను ఈ సినిమా యూనిట్ ఎంచుకున్నారు అని టాక్.
వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించ బోతున్న ఈ సినిమా బడ్జెట్ కూడా కథ రీత్యా చాల భారీగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా తరువాత బాలకృష్ణ నటించబోయే 100వ సినిమా ఉంటుంది కాబట్టి ఏ విషయంలోనూ రాజీ పడకుండా ఈ సినిమాను బాలయ్య అభిమానులకు నచ్చే విధంగా తీయడానికి ప్రయత్నిస్తున్నారట
ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో మొదలు పెట్టి వేగంగా పూర్తి చేసి ఇదే సంవత్సరం ఆగష్టు, సెప్టెంబర్ ప్రాంతాలలో విడుదలచేసి బాలయ్య 100వ సినిమాకు లైన్ క్లియర్ చేయాలని ఆలోచన అని అంటున్నారు. ఇప్పటికే తన సినిమా టైటిల్స్ తో తన పవర్ ను పెంచేసుకుంటున్నబాలకృష్ణ తన 100వ సినిమాకు ఇంకా ఎంత పవర్ ఫుల్ టైటిల్ పెడతాడో చూడాలి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77642/BALAKRISHNA-BECOMING-DICTATOR/
0 comments:
Post a Comment