ఆరు కోట్లు కురిపించే ఒక ఫ్యాన్సీ ఆఫర్ విషయంలో సమంత అతిగా ఆలోచించి నిర్ణయం తీసుకునే లోపే ఆ ఫర్ ను సన్నీ లియోన్ తన్నుకు పోయింది అనే వార్తలు వస్తున్నాయి. వివరాలలోకి వెళితే దక్షిణాది సినిమా రంగంలో సూపర్ హీరోయిన్ గా వెలుగొందుతున్న సమంత కొన్ని ప్రముఖ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా ప్రచారం చేస్తూ ఇప్పటికే కొన్ని కోట్లు సంపాదిస్తున్న సంగతి తెలిసిందే.
ఆరు కోట్లు ఇచ్చి కేవలం దక్షిణాది ప్రాంతంలో మాత్రమే ఇమేజ్ ఉన్న సమంత కంటే దేశం మొత్తం పాపులారిటీ ఉన్న సన్నీ లియోన్ బెటర్ అనే ఆలోచనలలో ప్రస్తుతం జాకీ కంపెనీ యాజమాన్యం ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే యూత్ లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని అండర్ గార్మెంట్స్ విభాగంలో ప్రముఖ స్థానంలో ఉన్న జాకీ బ్రాండ్ తమ ప్రొడక్ట్స్ కు మరింత పాపులారిటీ పెంచాలనే ఉద్దేశ్యంతో సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా ఎంచుకోవడానికి నిర్ణయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. రెండు సంవత్సరాల పాటు కొనసాగే ఈ ఎగ్రిమెంట్ వల్ల సమంతకు ఆరు కోట్ల భారీ పారితోషికాన్ని కూడా ఆఫర్ చేసారట అని తెలుస్తోంది. అయితే సమంత మాత్రం ఈ యాడ్ లో నటిస్తాను కాని మరీ హద్దులు మీరి ఎక్స్ పోజింగ్ చేయను అని చెప్పేసరికి జాకీ కంపెనీ వారు ఆలోచనలో పడ్డారట. ఈలోపున ఈ విషయాన్ని తెలుసుకున్న సన్నీ లియోన్ రంగంలోకి దిగి తాను ఎటువంటి ఎక్స్ పోజింగ్ కు అయినా సిద్ధం అని సంకేతాలు పంపడంతో ఇప్పుడు సీన్ రివర్స్ అయింది అని టాక్.
ఆరు కోట్లు ఇచ్చి కేవలం దక్షిణాది ప్రాంతంలో మాత్రమే ఇమేజ్ ఉన్న సమంత కంటే దేశం మొత్తం పాపులారిటీ ఉన్న సన్నీ లియోన్ బెటర్ అనే ఆలోచనలలో ప్రస్తుతం జాకీ కంపెనీ యాజమాన్యం ఉంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.
0 comments:
Post a Comment