ప్రిన్స్ నటిస్తున్న తాజా సినిమా `వేర్ ఈజ్ విద్యాబాలన్`. జ్యోతీ సేథ్ నాయిక. కృష్ణబద్రి, శ్రీధర్ రెడ్డి సమర్పిస్తున్నారు. శ్రీ భ్రమరాంబ క్రియేషన్స్ పతాకంపై ఎల్.వేణుగోపాల్‌రెడ్డి, పి.లక్ష్మి నర్సింహారెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ ``టైటిల్ తరహాలోనే సినిమా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
విద్యాబాలన్ కోసం ఎవరు, ఎందుకు వెతుకుతున్నారనేది ఆసక్తికరం. క్రైమ్ కామెడీ నేపథ్యంలో సాగే సినిమా. ప్రిన్స్ పిజ్జా డెలివరీ బాయ్‌గా నటిస్తున్నారు`` అని చెప్పారు. నిర్మాతలు మాట్లాడుతూ ``యూత్‌కి, మాస్‌కి నచ్చే కథ ఇది. ప్రస్తుతం రీరికార్డింగ్ పనులు జరుగుతున్నాయి`` అని అన్నారు.
0 comments:
Post a Comment