పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య తన తండ్రి వారసత్వాని కొనసాగిస్తూ భవిష్యత్ లో ఒక మంచి క్లాసికల్ డాన్సర్ గా మారడానికి తన వంతు ప్రయత్నాలు అప్పుడే మొదలు పెట్టేసింది. గతంలో పవన్ తో పాటు షూటింగ్ స్పాట్ లో కనిపించే ఆద్య పెరిగి పెద్దది అయి తాను చదువుకుంటున్న స్కూల్ లో జరిగిన కల్చరల్ ప్రోగ్రామ్ లో ఆద్య తన శాస్త్రీయ నృత్యంతో అదర గొట్టింది.
క్లాసికల్ డాన్సర్ గా మారిన తన కూతురు ఆద్య ఫోటోను రేణు దేశాయ్ తన ట్విటర్ లో పెట్టి హడావిడి చేసింది. అంతేకాదు వేదిక పై ఆద్య డాన్స్ చేస్తూ ఉంటే తనకన్నా ఒక తండ్రిగా పవన్ కళ్యాణ్ పొందే ఆనందం మాటలలో వర్ణించ లేనిది అని అంటూ భావ యుక్తంగా ట్విట్ చేసింది.
ఇప్పటికే పవన్ కొడుకు అకిరా నందన్ బాల నటుడిగా మారిన నేపధ్యంలో ఇప్పుడు లేటెస్ట్ గా ఆద్య క్లాసికల్ డాన్సర్ గా మారడంతో పవన్ దూరంగా ఉన్నా తమ తండ్రి కళా సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగిస్తూ టాలీవుడ్ ఎంపరర్ వారసులుగా తమ నైపుణ్యాన్ని తమ తల్లి రేణు దేశాయ్ వద్ద మెరుగులు దిద్దుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.
అంతేకాదు ఇప్పటికే పెరిగి పోయిన మెగా కుటుంబ వారసుల లిస్టులో తమ పేర్లను కూడా జత చేసుకుంటున్నారు ఆద్య, అకిరా నందన్ లు.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77736/PAVAN-DAUGHTER-CONTINUING-PAVAN-LEGACY-/
0 comments:
Post a Comment