Menu

trivikram-srinivas-pardhu
ఫిలిమ్ ఛాంబర్ ఆఫీసులో రిజిస్టర్ చేయబడ్డ పార్థు టైటిల్ ఇప్పుడు టాపిక్ ఆహ్ టాలీవుడ్ గా మారింది. ఈ సినిమా టైటిల్ ను హాసిని సంస్థ రిజిస్టర్ చేయించింది అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈ టైటిల్ ఈ సంవత్సరం ద్వితీయ భాగంలో ప్రారంభం కాబోతున్న త్రివిక్రమ్, మహేష్ ల కాంబినేషన్ లో రూపొందబోయే సినిమా కోసమే అంటూ అప్పుడే ఫిలింనగర్ లో గాసిప్పులు మొదలు అయిపోయాయి.

మహేష్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వచ్చిన ‘అతడు’ సినిమాలో హీరో పేరు పార్ధు. ఈ సినిమాను ఇప్పటికీ ఎన్ని సార్లు బుల్లితెర పై టెలికాస్ట్ చేసినా చూసే జనం విపరీతంగా ఉన్నారు. ఈ సినిమాలోని మహేష్ నటనకు అనేక అవార్డులు కూడా వచ్చాయి. అయితే మహేష్, త్రివిక్రమ్ లు ఒక సినిమాను చేయబోతున్నది వాస్తవమే అయినా ‘అతడు’ సినిమాకు సీక్వెల్ గా ఈ పార్ధు ను మార్చే సాహసం త్రివిక్రమ్ చేస్తాడా అనే సందేహం చాలామందిలో ఉంది.

అయితే ‘అతడు’ కు సీక్వెల్ గా కాకుండా కేవలం ఆ సినిమాలోని మహేష్ పాత్ర పేరును ఉపయోగించుకుంటూ త్రివిక్రమ్ మరో కథను తీస్తాడని చాలామంది అంటున్నారు. త్రివిక్రమ్ మహేష్ ల కాంబినేషన్ కు మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఆ క్రేజ్ ను మరింత పెంచడానికి సినిమా టైటిల్ కు ‘పార్థు’ అని పేరు పెట్టి ఉంటారని మరికొందరు వాదిస్తున్నారు.

ఏది ఎలా ఉన్నా కేవలం రిజిస్టర్ చేయబడ్డ ఒకేఒక్క రెండు అక్షరాల టైటిల్ అనేక ఊహలకు తావిస్తూ ఈరోజు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారి పోయింది. ఇంతకీ ఈ పార్థు ఎవరో మరికొద్ది రోజులలో క్లారిటీ వస్తుంది.

source:http://www.apherald.com/MOVIES/ViewARTICLE/77729/WHO-IS-THIS-PARDHU/

0 comments:

Post a Comment

 
Top