Menu

charan-sruthi-hassan-upasana

టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ లలో సినిమాలు చేస్తూ చాల వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న శ్రుతిహాసన్ రామ్ చరణ్ భార్య ఉపాసనకు మంచి స్నేహితురాలు. ఈమధ్య హైదరాబాద్ వచ్చిన శ్రుతిహాసన్ ఎన్నో కార్యక్రమాల మధ్య బిజీగా ఉన్నా చరణ్ ఇంటికి వెళ్ళి ఉపాసనకు అనుకోని షాక్ ఇచ్చిందని టాక్ .

శ్రుతిహాసన్ ‘ఎవడు’ సినిమాలో చరణ్ తో కలిసి నటించిన నాటి నుండి శ్రుతి, ఉపాసనల మధ్య పరిచయం ఏర్పడి అది స్నేహబంధంగా మారింది అని చాలామంది అంటారు. ఆ అనుబంధం రీత్యానే ఈమధ్య శ్రుతి చరణ్ ఇంటికి వెళ్ళి ఆ దంపతులకు అనుకోని షాక్ ఇవ్వడమే కాకుండా ఈ ముగ్గురూ కలిసి భాగ్యనరాన్ని చుట్టేస్తూ హడావిడి చేసారని టాక్.

అంతేకాదు ఈ ముగ్గురు కలిసి తీయించుకున్న ఒక సెల్ఫీ ఫోటోను శ్రుతి తన ఫేస్ బుక్ లో పెట్టి మెగా కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని చాటుకుంటోంది. చరణ్ తో ‘ఎవడు’ బన్నీతో ‘రేసు గుర్రం’ సినిమాలలో నటించి మెగా కుటుంబానికి గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపొయింది శ్రుతి.

ఇదే సంవత్సరం సురేంద్రరెడ్డి దర్శకత్వంలో చరణ్ నటించబోతున్న మరో కొత్త సినిమాలో కూడా శ్రుతి హీరోయిన్ గా ఎంపిక అయింది అని వార్తలు ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా శ్రుతి,చరణ్, ఉపాసనల సెల్ఫీ ఫోటో ఇప్పుడు వెబ్ మీడియాకు హాట్ న్యూస్.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77739/SHRUTI-HASSAN-UPASANA-FRIEND-SHIP-BECOMES-HOT-TOIC/

0 comments:

Post a Comment

 
Top