Menu

konavenkat-PAWAN

‘గబ్బర్‌సింగ్‌ 2’ ఎప్పుడు మొదలు అవుతుందో తెలియదు. కానీ ఆ సినిమా పై మీడియాలో వార్తలు రాకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదు. ఇప్పటికే కథలో ఎన్నో మార్పులు చేసుకున్న ఈ సినిమా స్క్రిప్టు వర్క్ ఇంకా ఒక కొలిక్కి రాలేదనే చాలామంది అంటారు. గత రెండేళ్లుగా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క జరుగుతూనే ఉంది.

ఇంత సుధీర్ఘ కాలం ఒక సినిమా పై స్క్రిప్ట్ వర్క్ జరగడం ఈమధ్య కాలంలో ‘గబ్బర్ సింగ్2’ రికార్డు అని అంటున్నారు. సంపత్ నంది తరువాత ‘పవర్‌’ డైరెక్టర్‌ బాబీ చేతికి ఈ ప్రాజెక్ట్‌ వెళ్లాక అతను స్క్రిప్టుపై రీవర్క్‌ స్టార్ట్‌ చేసాడు అనే వార్తలు ఉన్నాయి. కథ, కథనం ఖరారు కావడంతో ఇప్పుడు డైలాగ్‌ వెర్షన్‌ రెడీ చేస్తున్నారు అని టాక్.

అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లో కోన వెంకట్‌ వచ్చి చేరాడని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇతడు ఈ సినిమాకు డైలాగ్స్‌ రాస్తున్నాడని సమాచారం. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా హిట్‌ సినిమాల్లో కోన వెంకట్‌ కాంట్రిబ్యూషన్‌ ఉండడంతో ‘గబ్బర్‌సింగ్‌ 2’కి కూడా అతని లక్కీ సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నారట.
ఎప్పటి నుంచో పవన్ సినిమాకు దర్శకత్వం వహించాలని కలలు కంటున్న కోన వెంకట్ కు ఇది ఊహించని అవకాశం. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుందో ఇప్పటికీ క్లారిటీ లేక పోవడంతో మళ్ళీ ఈ గబ్బర్ వాయిదా పడుతుందా అనే టాక్ కూడా నడుస్తోంది.

SOURCE:http://www.apherald.com/MOVIES/ViewArticle/77631/KONAVANKAT-TWIST-WITH-PAVAN/

0 comments:

Post a Comment

 
Top