ప్రిన్స్ మహేష్ బాబు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సలహాను అనుసరిoపబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ పిలుపుతో మన దేశంలోని పారిశ్రామిక వేత్తలు వివిధ రంగాలకు చెందిన సెలిబ్రెటీలు ఒకొక్క గ్రామాన్ని తీసుకుని అభివృద్ధి చేస్తున్న నేపధ్యంలో ఇప్పుడు ఈ లిస్టు లోకి ప్రిన్సు మహేష్ బాబు కూడా చేరిపోయాడు.
మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం మహేష్ బాబు త్వరలో తమ స్వ గ్రామమైన గుంటూరు జిల్లాలోని బుర్రిపాలెంను దత్తత తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మహేష్ బావ గుంటూరు ఎమ్.పి. గల్లా జయిదేవ్ తెలియచేసారు. అలాగే హీరో కృష్ణ పెద్ద అమ్మాయి మహేష్ సోదరి అయిన పద్మ కంచర్లపాలెం గ్రామాన్ని దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్ గా మార్చబోతోంది అని తెలుస్తోంది.
ఇప్పటికే తన బ్రాండ్ ఎండార్స్ మెంట్ల ద్వారా వస్తున్న ఆదాయంలో 30 శాతం సేవాకార్యక్రమలకు వినియోగిస్తున్న మహేష్ ఆద్వర్యంలో బుర్రిపాలెం ఒక మోడల్ విలేజ్ గా మారి సూపర్ స్టార్ కృష్ణ కలలను నిజం చేస్తుందని ఆశిద్దాం. మహేష్ స్పూర్తితో ప్రిన్స్ అభిమానులు కూడా ఇటువంటి కార్యక్రమాలను చేపడతారేమో చూడాలి. ప్రధాని పిలుపుతో దేశవ్యాప్తంగా ఎందరో సెలెబ్రెటీలు గ్రామాలను దత్తత తీసుకుంటున్న నేపధ్యంలో మహాత్మాగాంధీ కోరుకున్న గ్రామీణ అభివృద్ధి కనీసం ఇప్పటికైనా వాస్తవ రూపంలోకి వస్తోందని భావిద్దాం.
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.