Menu

alluarjun

సూపర్‌స్టార్‌డమ్‌ రానంత వరకు ఫర్లేదు కానీ... వచ్చిన తర్వాత సరదా తీరిపోతుంది. ఎందుకంటే సూపర్‌స్టార్‌ కానంత వరకు అంచనాలు మామూలుగా ఉంటాయి. సినిమా రిలీజ్‌కి ముందు వ్యాపారం ఒక రేంజ్‌కి పరిమితం అవుతుంది. కానీ ఒక్కసారి సూపర్‌స్టార్‌ అనిపించేసుకుంటే లెక్కలు మారిపోతాయి. అంచనాలు తారాస్థాయిలో ఉండడంతో పాటు బయ్యర్లు ఎంతయినా ఇచ్చేసి కొనేయడానికి ముందుకొచ్చేస్తారు. అలాంటి టైమ్‌లో హిట్స్‌ ఇవ్వడం చాలా కష్టం. ఎన్టీఆర్‌ హిట్‌ కొట్టడానికి అంత స్ట్రగుల్‌ అవుతున్నాడన్నా, మహేష్‌కి కన్సిస్టెంట్‌గా సక్సెస్‌లు రావట్లేదన్నా, పవన్‌ కళ్యాణ్‌ పదేళ్ల పాటు హిట్లు లేక ఇబ్బందులు పడినా ఈ సూపర్‌స్టార్‌డమ్‌ కారణం. 

రేసుగుర్రంతో సూపర్‌స్టార్‌ అనిపించేసుకున్న అల్లు అర్జున్‌ తదుపరి చిత్రం 'సన్నాఫ్‌ సత్యమూర్తి'పై భారీగా అంచనాలున్నాయి. బిజినెస్‌ యాభై కోట్ల పరిధిలో జరుగుతోంది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అయితే తప్ప పెట్టిన డబ్బులు తిరిగి రావు. ఇంతకాలం ముప్పయ్‌ అయిదు.. నలభై కోట్ల పరిధిలో ఉన్న బన్నీ ఇప్పుడు ఈ స్టార్‌డమ్‌తో నలిగిపోతున్నాడు. ఈ ప్రెజర్‌తో డెసిషన్‌ మేకింగ్‌ కూడా కష్టమే. దీనిని ఎలా బ్యాలెన్స్‌ చేసుకుంటాడో, తన సక్సెస్‌ రేట్‌ ఎలా నిలబెట్టుకుంటాడో చూడాలి. 


source:http://telugu.gulte.com/tmovienews/8428/Stardom-pressure-heats-up-Allu-Arjun

0 comments:

Post a Comment

 
Top