Menu

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ మూవీ సక్సెస్ కావాలంటే కేవలం స్టార్ డం కలిగి ఉన్న హీరో, హీరోయిన్స్, డైరెక్టర్ ఉంటే సరిపోదు. కథలో దమ్ము ఏంటో తెలియాలంటే, ఆ కథని నిలబెట్టే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చాలా కీలకం. అలాంటి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసే యాక్టర్స్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఒకరే రాజేంద్రప్రసాద్.

రాజేంద్రప్రసాద్ ఎప్పుడైతే క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నాడో, తను చేస్తున్న మూవీలు అన్నీ దాదాపు బాక్సాపీస్ ని షేక్ చేసే మూవీలుగానే ఉంటున్నాయి. వివరాల్లోకి వెళితే, అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం కానున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని.. ప్రేమికుల రోజున అక్కినేని కుటుంబం అఖిల్ ని హీరోగా లాంచ్ చేసి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసారు.

ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. వినాయక్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా పై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ షెడ్యూల్స్ కి సంబంధించిన విషయాల్లోకి వెళితే, ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరబాద్ లోని ఓల్డ్ సిటీలో జరగనుంది. ముందుగా అఖిల్ పై ఓ యాక్షన్ ఎపిసోడ్ ని షూట్ చేయనున్నారు. అలాగే ఈ మూవీకి సంబంధించిన క్లియర్ టాక్స్ ప్రకారం, అఖిల్ కి ఫాదర్ గా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నాడని సమాచారం.

కథా పరంగా అఖిల్ ఫాదర్ పాత్రకి రాజేంద్ర ప్రసాద్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతాడని, ఆయన్ని అప్రోచ్ అయ్యారని. రాజేంద్రప్రసాద్ సైతం దీనికి సముఖత చూపినట్లు సమాచారం. అయితే మొదట అఖిల్ కి ఫాదర్ పాత్ర చేయాలంటే, కచ్ఛితంగా తన రోల్ పవర్ ఫుల్ గా ఉంటేనే చేస్తానని దర్శకుడికి కండిషన్ పెట్టాడంట రాజేంద్రప్రసాద్. వినాయక్ స్క్రిప్ట్ ని చూపించిన తరువాత, రాజేంద్రప్రసాద్ వెంటనే అఖిల్ సరసన ఫాదర్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78910/AKKINENI-AKHIL-NITHIN-VINAYAK-AKHIL-AKKINENI-FILMS/

0 comments:

Post a Comment

 
Top