ఇండియా 300 రన్స్ చేసి ప్రపంచ కప్ మ్యాచ్ లలో శుభారంభం చేసిన నేపధ్యంలో ఇండియా విజయాన్ని కాంక్షిస్తూ ప్లకార్డులు ఇండియా టీమ్ అభిమానులు టివి కెమెరాలకు ఎదురుగా చూపెడుతూ తమ దేశానికి విజయం రావాలని కోరుకుంటూ హడావిడి చేస్తున్నారు. ఈ హడావిడిలో భాగంగా ఆస్ట్రేలియాలోని జూనియర్ అభిమానులు కూడా ఒక వైపు ఇండియన్ టీమ్ ను ఉత్సాహ పరుస్తూ ‘టెంపర్’ సినిమాకు సంబంధించిన ప్లకార్డులు పైకి ఎత్తి పెట్టి టివి కెమెరాలలో కనిపించేడట్లు చూపించడం చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది.
అంతేకాదు వరల్డ్ కప్ హోరులో కూడా తమ యంగ్ టైగర్ ను మరిచి పోకుండా ‘టెంపర్’ సినిమాకు ఏకంగా జాతీయ స్థాయి చానల్స్ లో తమ ప్లకార్డుల ద్వారా హడావిడి చేయడం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారిలో జూనియర్ క్రేజ్ ఏ విధంగా ఉందో అర్ధం అవుతుంది. ఒక వైపు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ హోరాహోరీగా జరుగుతున్నా నిన్నటి రెండవ రోజుకు ‘టెంపర్’ ప్రపంచ వ్యాప్తంగా 13 కోట్లకుకు పైగా కలెక్షన్స్ ను రాబట్టింది అని వార్తలు వస్తున్నాయి.
అయితే జూనియర్ ఈ సినిమా ప్రమోషన్ గురించి బుల్లితెర పై ఇంకా కనిపించక పోవడం చాల మందికి అర్ధం కాని ప్రశ్నగా మారింది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78798/TEMPER-HUNGAAMA-IN-INDO-PAK-CRIKET-MATCH/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.