Menu

మెగా హీరో రామ్ చరణ్ తేజ్ తన అప్ కమింగ్ మూవీకి సంబంధించిన విషయాలపై పూర్తి క్లారిటి ఇచ్చేశాడు. రామ్ చరణ్, శ్రీనువైట్ల కాంబినేషన్ లో రాబోతున్న మూవీపై పూర్తి డిటైల్స్ ని మీకు అందిస్తున్నాం. ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న క్లియర్ టాక్స్ ప్రకారం, ఈ సినిమా మార్చి 5న ప్రారంభం అవుతుంది.

ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత దానయ్య, ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్న భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం ఇది. రామ్ చరణ్ తో చేయనున్న సినిమా గురించి శ్రీనువైట్ల మాట్లాడుతూ..’ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ యాక్షన్ కధా చిత్రంగా ఈ చిత్రానికి రూపకల్పన చేస్తున్నట్లు’ తెలిపారు.

నిర్మాత దానయ్య మాట్లాడుతూ ‘ఎన్నో భారీ విజయవంతమైన చిత్రాల కాంబినేషన్ శ్రీనువైట్ల, రచయితలు కోనవెంకట్, గోపీమోహన్ లది. ఆ విజయాల కాంబినేషన్ ను రిపీట్ చేస్తూ రూపొందుతోందీ చిత్రం. రామ్ చరణ్ సినిమాకి మూలకధ స్క్రీన్ ప్లే-దర్సకత్వం శ్రీనువైట్ల అందిస్తే, కధను కోనవెంకట్, గోపీమోహన్ లు అందిస్తున్నారు.

మాటలను కోనవెంకట్ రాయనున్నాడు. రామ్ చరణ్ సరసన నాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోందని’ తెలిపారు. ‘వై దిస్ కొలవరి’ పాటకు సంగీతం సమకూర్చిన యువ సంగీత దర్శకుడు అనిరుధ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. మార్చి 5న ఈ సినిమాని అధికారికంగా లాంచ్ చేసి మార్చి 16 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. అలాగే ఈ చిత్ర టీం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 15న ఈ సినిమా రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78801/Shradha-kapoor-ram-charan-tollywood-bollywood-ramc/

0 comments:

Post a Comment

 
Top