టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం మూవీలను నిర్మించడం అనేది చాలా సులభమైన పనిగా మారింది. అయితే ఇది ఒకప్పుడు చాలా కష్టతరం. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాటిలో ఏది కష్టం అంటే అది రిలీజ్ చేసుకోవటం, అలాగే దానిని ప్రమోట్ చేసుకోవటం. ఓ మూవీని ఎంత గొప్పగా తెరకెక్కించినా దానికి పబ్లిసిటీ లేకపోతే అది సాధారణ టాక్ ని సొంతం చేసుకోవటమే చాలా ఇబ్బందిగా మారుతుంది.
అందుకే లేటు వయసులో, లేటుగా వచ్చిన ‘ప్రేమకథా చిత్రమ్’ హీరో సుధీర్ బాబు, తన ప్రతి మూవీలో పబ్లిసిటినే ఎక్కువుగా నమ్ముకుంటాడు. తన మూవీ రిలీజ్ అంటే కంపల్సరీగా మహేష్ బాబుకి పని తప్పదనే టాక్ ఇండస్ట్రీలో ఉంది. ప్రస్తుతం సుధీర్ నటించిన అప్ కమింగ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’.
ప్రేమ కథా చిత్రమ్ లో సుధీర్ బాబుతో జత కట్టిన నందిత మరోసారి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని చంద్రు దర్శకత్వంలో తెరకెక్కింది. షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్దంగా ఉంది. ముందుగా ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ చెయ్యాలని అనుకున్నా కుదరకపోవడంతో ఈ చిత్ర టీం మరో మంచి రిలీజ్ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే, తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రమోషన్స్ లో పాల్గొంటాడని టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అక్కినేని నాగ చైతన్య, దగ్గుబాటి రానా అతిధి పాత్రల్లో కనిపించనున్నారు. కన్నడలో మంచి విజయం సాదించిన ‘చార్మినార్’ ఈ చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కుతోంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78803/Sudheer-babu-tollywood-sudheer-babu-body-sudheer-b/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.