Menu

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ టాప్ బ్యూటీ సమంత వరుస సినిమాలను ఒప్పుకుంటుంది. అయితే, తను ఇప్పటి వరకూ క్రేజీ కాంబినేషన్స్ ని మాత్రమే సెలక్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇక నుండి తను మూవీలను సెలక్ట్ చేసుకునేటప్పుడు ఒక్క కాంబినేషన్ మాత్రమే కాకుండా, గతంలో తను ఎవరికైతే మాట ఇస్తుందో, వారికి కూడ అవకాశాలను ఇవ్వటానికి ప్రయత్నిస్తుంది. సమంత బాక్సాపీస్ క్వీన్ గా మారడంతో, తనని హీరోయిన్ గా సెలక్ట్ చేసుకోవటానికి పలువురు దర్శకులు పోటీ పడుతున్నారు.

ఆ విధంగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సమంత తొలిసారిగా నటించిన సినిమా ‘మనం’. అక్కినేని త్రయం నటించిన ఈ సినిమాలో సమంత ద్విపాత్రాభినయం చేసింది. ఆమె నటనకు విమర్శకుల నుండి ప్రసంశలు లభించాయి. తాజాగా మరోసారి విక్రమ్ కుమార్ సినిమాలో నటించడానికి సమంత రెడీ అవుతుందని క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి.

తమిళ స్టార్ సూర్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ’24’ అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్ గా నటించే అవకాశం సమంతకు లభించిందట. మనం సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు విక్రమ్ కుమార్, సమంత వద్ద నుండి ముందుగానే డేట్స్ తీసుకోవడంతో, ఈ కాంబినేషన్ ఇప్పుడు ఇలా రెడీ అవుతుందని అంటున్నారు.

2డి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై హీరో సూర్య స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఏఅర్ రెహమాన్ సంగీత దర్శకుడు. సూర్యతో ‘సికిందర్’ సినిమాలో సమంత మొదటిసారి నటించింది. అయితే ఆ సినిమా బాక్సాపీస్ వద్ద నిరాశ పరచడంతో, మరోసారి వీరు హిట్ కాంబినేషన్ టాక్ ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78802/Samantha-tollywood-vikram-dhanush-kollywood-telguu/

0 comments:

Post a Comment

 
Top