దర్శకేంద్రుడిగా పేరుగాంచిన రాఘవేంద్రరావు హీరోయిన్స్ ను చాలా గ్లామరస్ గా చూపెట్టడమే కాదు ఆ హీరోయిన్స్ పై పువ్వులు, పండ్లు విసురుతూ ఆ హీరోయిన్స్ కు ఒక క్రేజ్ ను రప్పించడంలో రాఘవేంద్రరావుకు తెలిసినంత టెక్నిక్ మరే దర్శకుడికి తెలియదు అంటే అతిశయోక్తి కాదేమో. ఒక దశలో టాలీవుడ్ లో నటిస్తున్న ప్రతి హీరోయిన్ రాఘవేంద్రరావు సినిమాలో నటించాలని కోరుకునేది.
ఆరోజులలో బాలీవుడ్ హీరోయిన్ టబును టాలీవుడ్ కు పరిచయం చేసి ఆమెను అలనాటి రోజుల శృంగార నాయికగా మార్చిన విషయం తెలిసిందే. సీనియర్ టాప్ హీరోలందరితోను టాబు అనేక గ్లామరస్ పాత్రలలో నటించింది. అయితే ఈమెకు మంచి నటిగా కూడా పేరు రావడమే కాకుండా జాతీయ స్థాయిలో ఉత్తమనటి అవార్డును అందుకుంది. ప్రస్తుతం అప్పుడప్పుడు సినిమాలలో కనిపిస్తున్న ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావు పై ఆ శక్తికర కామెంట్స్ చేసింది.
ఆమె కెరియర్ తొలిరోజులలో సినిమాలలో నటిస్తున్నప్పుడు శృంగార సన్నివేశాలలో నటిస్తున్నప్పుడు తన ముఖంలో సెక్స్ ఎక్స్ ప్రెషన్స్ ను తీసుకు రాలేక చాల ఇబ్బంది పడేదట. అయితే ఆమె సమస్యను గుర్తించిన రాఘవేంద్రరావు అటువంటి సన్నివేశాలలో శృంగార పరంగా ప్రేక్షకులను రెచ్చగొట్టే విధంగా ఎలా నటించాలో విడమరచి చెప్పిన తన తొలి గురువు రాఘవేంద్రరావు అని అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
అంతేకాదు శరీరంలో బాధ కలిగినప్పుడు మన ముఖంలో ఎటువంటి భావాలను చూపెడతామో అలా నటిస్తే చాలు సెక్స్ ఎక్స్ ప్రెషన్స్ వచ్చేస్తాయని రాఘవేంద్రరావు టబూకు జ్ఞానోపదేశం చేసినట్లుగా కూడ చెబుతోంది ఈ హాట్ బ్యూటీ. అందుకే కాబోలు ఎంతమంది హాట్ బ్యూటీలు వచ్చినా టబు స్థానాన్ని ఎవరూ అందుకోలేక పోతున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78794/HOT-HEROINE-SENSATIONAL-COMMENTS-ON-RAGHAVENDRA-RAO/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.