March 15, 2025 02:14:33 AM Menu
Latest

6:28 PM test1

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ నటించిన టెంపర్ మూవీ బాక్సాపీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా ఆడుతుంది. టెంపర్ మూవీతో యంగ్ టైగర్ సక్సెస్ కొట్టాడనే చెప్పవచ్చు. టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద కూడ ఈ మూవీకి సంబంధించిన కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. దానికి సంబంధించిన వివరాలను మీకు అందిస్తున్నాం. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఫుల్ లెంగ్త్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించిన సినిమా ‘టెంపర్’. నందమూరి అభిమానులతో పాటు సినిమా ప్రేమికుల నుంచి కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, బాక్స్ ఆఫీసు వద్ద ఆశించదగ్గ కలెక్షన్స్ కొల్లగొడుతోంది.

టెంపర్ సినిమా నైజాం లో మొదటి రోజు 2.71 కోట్ల షేర్ సాధించింది. అలాగే రెండవ రోజు సైతం నైజాం లో 1.5 కోట్ల షేర్ సాధించి బాక్స్ ఆఫీసు ని ఒక ఊపు ఊపేస్తోంది. మొదటి రెండు రోజుల్లో టెంపర్ మూవీ 4.21 కోట్ల షేర్ సాధించింది. ఆదివారం కూడా ఇదే స్థాయి కలెక్షన్స్ నమోదవుతాయని ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నారు.

అయితే ప్రస్తుతానికి అందిన క్లియర్ రిపోర్ట్స్ ప్రకారం నైజాంతో పాటు గుంటూరు, వైజాగ్ కి చెందిన రెండు రోజుల కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

‘టెంపర్’ మొదటి రెండు రోజుల కలెక్షన్స్ డీటైల్స్
నైజాం – 4.21కోట్లు
గుంటూరు – 1.57కోట్లు
వైజాగ్ – 1.11కోట్లు.

యంగ్ టైగర్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ కి పూరి జగన్నాధ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, పంచ్ డైలాగ్స్ తోడవడంతో థియేటర్స్ లో ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు.వక్కంతం వంశీ కథ అందించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా, మధురిమ, సోనియా అగర్వాల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78805/Ntr-sukumar-tollywood-rakhul-preeth-sings-ntr-film/ 
15 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top