Menu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సపోర్ట్ ని టాలీవుడ్ కి చెందిన యంగ్ హీరో కోరుకుంటున్నాడు. వివరాల్లోకి వెళితే, టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ హీరోగా పేరు సంపాదించుకున్న రామ్, గత కొంత కాలంగా బాక్సాపీస్ వద్ద సరైన విజయాలను అందుకోలేక పోతున్నాడు. ఎలాగైన బాక్సాపీస్ విజయాన్ని అందుకోవడం కోసం రామ్ ఓ మాస్టర్ ప్లాన్ ఉన్నట్టు తెలుస్తుంది.

నిజానికి రామ్ సైతం తన మూవీలలో పవన్ కళ్యాణ్ నటనను అనుకరిస్తాడు. కాని ఏ సందర్భంలోనూ తను పవన్ అభిమానిని అని మూవీలలో చెప్పుకోడు. కాని ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, కచ్ఛితంగా పవన్ కళ్యాణ్ క్రేజ్ ని వాడుకోవాల్సిందే అని రామ్ డిసైడ్ అయ్యాడంట. ప్రస్తుతం ఆ తరహా కథ కోసం రామ్ వెతుకుతున్న సమాచారం.

పవన్ కళ్యాణ్ మేజరిజమ్ కలిగివున్న పాయింట్ ని తన కథలో కొద్ది భాగం వాడుకోవాలన్నదే రామ్ ఆలోచన. టాలీవుడ్ లో టాక్స్ ప్రకారం, ఇప్పటికే రామ్ ఓ కథని సెలక్ట్ చేసుకున్నాడని, ఇంకా మరి కొన్ని కథలను వినటానికి ఆసక్తి చూపుతున్నాడని తెలుస్తుంది. గతంలో నితిన్ మాత్రమే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ అభిమానిగా బహిర్గతం అయ్యాడు.

దాదాపు నితిన్ లాగే రామ్ కూడ మారతాడేమో అని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాలలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఏదేమైనా రామ్ అప్ కమింగ్ మూవీ ఆడియో ఫంక్షన్స్ లో ఈసారి పవన్ కళ్యాణ్ వచ్చినా, ఆశ్ఛర్యపడాల్సిన అవసరం లేదని అంటున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78869/Ram-pawan-kalyan-power-star-pawan-movie-ram-movies/

0 comments:

Post a Comment

 
Top