Menu

నిత్యామీనన్ మంచి నటి మాత్రమే కాదు ఆమె మాట్లాడే తీరు కూడా చాల విచిత్రంగా ఉంటుంది. ఎవర్నీ లెక్కచేయని నిత్య మనస్తత్వం ఆమెకు సినిమాలలో అవకాశాలు తగ్గేలా చేసాయి అనే కామెంట్స్ కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా ఈమె అల్లుఅర్జున్ తో నటిస్తున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమా విషయమై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఈ సినిమాలో నిత్య బన్నీకి సోదరిగా నటిస్తోంది అని మీడియాలో వస్తున్న వార్తల పై తనదైన తీరులో స్పందించింది. బన్నీకి చెల్లెలుగా నటించినంత మాత్రాన ఏమైనా ఘోరం జరిగి పోతుందా? అని మీడియాకు ఎదురు ప్రశ్నలు వేస్తూ తను ఎదో పాపం చేస్తున్నట్లుగా ఇటువంటి వార్తలు ఎందుకు రాస్తున్నారు అంటూ మీడియాకు షాక్ ఇచ్చే సమాధానం చెప్పింది నిత్యామీనన్.

అంతేకాదు బాలీవుడ్ లో కాజల్, షారూఖ్ ఖాన్ జోష్ చిత్రంలో అన్న చెల్లెళ్లు గా చేసారు, ఆ తర్వాత వాళ్ళిద్దరూ దేవదాసులో లవర్స్ గా చేసారు కదా అని అడుగుతోంది ఈ మలయాళీ భామ. అంతేకాదు తనకు అల్లుఅర్జున్ నటించబోయే తదుపరి చిత్రంలో హీరోయిన్ గ ఛాన్స్ ఇస్తానని ప్రామిస్ చేయడం వల్ల ఇలా నటించానని అసలు విషయం తెలియకుండా తన కెరియర్ అయిపోయింది అంటూ వార్తలు రాయవద్దని మీడియా పై విరుచుకు పడింది.

నిత్యమీనన్ చెపుతున్న ప్రకారం బన్నీ అటువంటి ప్రామిస్ ఇచ్చి ఉంటే బోయపాటి దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కాబోతున్న సినిమాలో నిత్యామీనన్ హీరోయిన్ గా చూసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అనుకోవాలి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78883/ALLUARJUN-GOT-SCHOCKED-WITH-NITYA-MENON-COMMENTS/

0 comments:

Post a Comment

 
Top